ఈ ప్రకృతిలో సహజంగా లభించే ప్రతి ఒక్కటి మానవాళి ఆరోగ్యానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా భూమిలో దొరికే దుంపల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ చలికాలంలో అందరికి మొహం పగిలి పోవడం, పొడిబారిపోయే అవకాశం ఉంటది. చలి నుండి ముఖాన్ని రక్షించుకోవడానికి పలు రకాల కాస్మొటిక్స్ వాడుకోవచ్చు కానీ వాటి వాల్ల కొన్ని చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది పైగా చాల ఖర్చుకూడా అవుతది. సహజసిద్ధమైన ఈ టిప్ వాడి కూడా ఈ చలి కాలంలోనే కాదు మొహం పగిలే సమస్య, పొడ బారే స్కిన్ సమస్య నుండి తప్పించుకోవచ్చు.
.
క్యారెట్లలో చర్మానికి మేలు చేసే ఔషధగుణాలు చాల ఉన్నాయి. సహజంగా దొరికే క్యారెట్ తో చర్మం శాశ్వతంగా మెరుస్తూ ఉండేలా చేసుకోవచ్చు. ఇంట్లోనే తయారు చేసుకునే క్యారెట్ పొడితో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. క్యారెట్ పౌడర్ ఎలా తయారు చేయాలి దీన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెష్ గా ఉన్న క్యారెట్లను శుభ్రమైన నీటిలో కడగాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోని తక్కువ ఎండలో ఉంచి ఆరబెట్టాలి. వారం రోజులు పొడి ఎండలో ఆరపెట్టిన తరువాత పొడిగా చేసుకోవాలి. మళ్ళీ ఆ పొడిని ఎండలో ఆరబెట్టండి. పొడి పొడిగా అయ్యాక జాగ్రత్తగా భద్రపరచుకోండి. తయారీ సమయంలో తడి తగలకుండా జాగ్రత తీసుకోండి.
నిగనిగలాడే మొహం కోసం ఈ టిప్ ఫాలో అవ్వండి. ముందుగా మొహాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కొని ఒక టీస్పూన్ క్యారెట్ పౌడర్‌ను పాలలో కలిపి ముఖం మీద అప్లై చేయండి. ౩౦ నిమిషాల తరువాత, ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి ఇలా వారానికి ఒకసారి చేస్తే మొహం కాంతివంతంగా మారుతుంది. పాలకు బదులుగా రోజ్‌వాటర్‌తో కూడా ఉపయోగించుకోవచ్చు. మెడపై నల్లటి మచ్చలు ఉన్నవారు కూడా క్యారెట్ పొడితో తేనే లేదా నిమ్మ రసం కలుపుకొని ఒక ప్యాక్ లాగా వేసుకొని పూర్తిగా ఆరిపోయాక కడుకోవాలి. ఇలా చేస్తే ఆ నల్ల మచ్చలు తొలగిపోతాయి. క్యారెట్‌లోని బీటా కెరోటినాయిడ్ మరియు యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యానికి సహాయపడడే కాకా చర్మపై ముడుతలు రాకుండా నివారిస్తాయి.