కరోనా వైరస్.. దీని గురుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ వైరస్ గురుంచి లేకుండా ఒక్క న్యూస్ కూడా ఉండదేమో.. అవును అది చేసిన ప్రమాదం అంతటిది మరీ.. అయితే.. కరోనా భారిన పడి చాలా చిన్న వయస్సువారు కూడా చనిపోతున్న మాట వాస్తవం. కానీ కరోనాని జయించిన వారిని చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. దీనికి కారణం కాటికి కాలు చాపిన ముసలివాళ్లు సైతం కరోనాను జయించడం.
దీనికి సాక్ష్యం వందేళ్లు వయస్సు దాటిన చాలామంది ముసలివాళ్లు విజయవంతంగా కరోనానుంచి బయటపడుతున్నారు. దీంతో మిలియన్ల మంది వృద్ధుల్లో కొత్త ఆశను చిగురిస్తున్నాయి. కరోనా వస్తే భయపడొద్దు.. పోరాడాలనే ధైర్యాన్ని నింపుతున్నాయి. ఇలాంటిదే ఒక 100 ఏళ్లు దాటిన వృద్ధుడు కరోనాతో పోరాడి గెలిచాడు. దాన్ని బీర్తాగి సెలబ్రేట్ చేశాడు.
103 ఏళ్ల జెన్నీ స్టెంజాకు కరోనా సోకింది. దాంతో హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నాడు. అనంతరం కరోనా నెగెటివ్ రాగానే ఆయన హాస్పిటల్ బెడ్‌పైనే కూల్బీర్ ఓపెన్‌చేసి తాగాడు. దీన్ని చూసిన సదరు బంధువులు ఆయన ఫొటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దాంతో ఆ ఫొటో వైరల్ అయ్యింది. కరోనాను జయించానని ఆ ముసలోడు చేసిన పనికి ఆయన ఆనందానికి ఇదే సంకేతమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అలాగే స్పెయిన్‌కు చెందిన 113 ఏళ్ల వృద్ధురాలు కూడా కరోనాను జయించింది. శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించిన మరియా బ్రాన్యాస్ స్పెయిన్‌లో స్థిరపడ్డారు. ఆ దేశంలో అధికారికంగా అతి పెద్ద మహిళగా ఆమె రికార్డుకెక్కింది. ఆమెకు ఏప్రిల్‌లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్న ఆమె కొన్ని వారాల్లోనే ఆమె పూర్తిగా కోలుకుంది.
అలాగే కరోనా భారిన పడిన ఇరాన్‌కు చెందిన 103 ఏళ్ల బామ్మ కూడా కోలుకుంది. ఆమె సెంట్రల్ సిటీ సెమ్నాన్‌లో వారంపాటు చికిత్స తీసుకుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యిందని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది. అలాగే రెండో ప్రపంచ యుద్ధాన్ని చూసిన ఒక వ్యక్తి కూడా కరోనాను జయించాడు.
తన 104 వ పుట్టినరోజును గ్రాండ్‌గా జరుపుకున్నాడు. వివరాల్లోకి పోతే విలియం లాప్చీస్కు మార్చి 10న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డాక్టర్ ఆయన కూతుర కరోలీ బ్రౌన్‌ను పిలిచి తండ్రి ఆరోగ్యం బాగ లేదని తెలిపాడు. బ్రతకడం కష్టం అన్నాడు. కానీ అయినా మొండిధైర్యంతో కరోనాతో జరిపిన పోరులో ఆయన విజయం సాధించి, అందరి సమక్షంలో బర్త్ డేను ఘనంగా జరుపుకున్నాడు.