Ghana Mudra: నేడు ఎక్కువ మంది బాధపడే సమస్యల్లో నిద్రలేమి ఒకటి.. కంటి నిండా నిద్ర పొకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. చాలా కాలంగా సరిగ్గా నిద్ర పోక పోతే బ్రెయిన్ బ్లాక్ అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇప్పటి వరకు నిద్ర పట్టడం కోసం చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయారా..!? అయితే సింపుల్ గా ఈ ఆసనం వేయండి.. ఇట్టే నిద్ర పడుతుంది..!! ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందాం..!!
యోగ ముద్రల వలన ఆరోగ్యానికి చాలా మంచిది. జ్ఞాన ముద్ర వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. జ్ఞాన ముద్ర వేయడం వల్ల మానసిక ఆరోగ్యం ప్రశాంతం గా ఉంటుంది. బ్రెయిన్ లోకి రక్త సరఫరా జరుగుతుంది. ఈ ముద్ర వేయటం వలన డైయాబెటిక్, తలనొప్పి, నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జ్ఞాన ముద్ర ఎలా వేయాలంటే.. ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. ముందుగా మీ బొటన వేలుని, చూపుడు వేలిని కలిపి పట్టుకోవాలి. ఇలా రోజూ అరగంట సేపు చేయాలి. ప్రతి 15 నిమిషాలకు గ్యాప్ తీసుకుని మళ్ళీ చెయ్యచ్చు. ఈ చిన్న ముద్ర ని ప్రతి రోజూ చేయటం ద్వారా పైన చెప్పుకున్న ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ రోజు నుంచి ట్రై చేయండి.