అలుమగాల జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది. ఓ సంస్థ ఈ విషయం పయిన చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
శృంగారాన్ని శాకాహారం తీసుకునే వారు ఎక్కువగా ఆస్వాదిస్తారా..? మంసాహారం తీసుకునేవారు ఎక్కువగా ఆస్వాదిస్తారా అనే అంశంపై సర్వే జరిగిందట … ఈ సర్వేలో 500 నాన్ వెజిటేరియన్స్ 500మంది వెజిటేరియన్స్ పాల్గొన్నారట. వారి ద్వారా సేకరించిన విషయాలలో.. శాకాహారులు వారానికి మూడు నుండి నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటున్నామని చెప్పారు .. మాంసాహారులు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే శృంగారం లో పాల్గొంటున్నామని చెప్పారట.
శాకాహారులు 89శాతం మంది తమ శృంగార జీవితాన్ని తృప్తిగా ఆస్వాదిస్తుంటే.. మాంసాహారులు మాత్రం కేవలం 59శాతం మాత్రమే ఆస్వాదిస్తున్నారట.ఓ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే..శాకాహారులు మెంతి ఆకులు, సోంపు, మాకా మరియు జిన్సెంగ్ వంటి కామోద్దీపన చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు, అందుకే వారు సెక్స్ చేయటానికి ఎక్కువ ఆసక్తిని చూపుతారు. ఆకుకూరల్లో విటమిన్లు సి, పాలీఫెనాల్స్ మరియు బీటా కెరోటిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ సెక్స్ డ్రైవ్‌ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
మరోవైపు దుంప కూరగాయలు, తీపి బంగాళాదుంప, క్యారెట్లు మరియు అవోకాడో లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ పెంచడంతో పాటు.. సెక్స్ డ్రైవ్‌ను మెరుగుపరుస్తుంది. అయితే.. పూర్తిగా శాకాహారులుగా ఉండటం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు. పూర్తిగా శాకాహారులుగా ఉంటూ.. మాంసాహారం జోలికి పోని వారిలో కొంత కాలం తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువ సమస్య ఉందట.
వారికి పీరియడ్స్ సమస్య తలెత్తే అవకాశం ఉందట. అంతేకాకుండా… వారి యోని త్వరగా పొడిబారి పోతుందట. అందుకే.. పూర్తిగా శాకాహారులుగా.. పూర్తిగా మాంసాహారాలుగా కాకుండా.. రెండింటినీ బ్యలెన్స్ గా తీసుకునేవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. రోజూ ఆకు కూరలు, కూరగాయలు తీసుకొని.. వారాంతం మాంసాహారం తీసుకునేవారు శృంగారంలో దూసుకుపోతారని నిపుణులు చెబుతున్నారు.