అబ్బో…దాని వలన పిల్లలు పుడతారని కూడాతెలియనివాళ్ళు ఉన్నారా?

శృంగారం, రొమాన్స్ లాంటి పదాలు మాట్లాడటానికే మన దేశంలో ఎవరూ ఇష్టపడరు. ఇంకా వాటిగుంరించి కన్న బిడ్డలకు వివరించి చెప్పడమే…ఇంకే మైనా ఉందా…  భారత్ లో శృంగార పరమైనవిషయాలలో మనమంతా వెనకపడిఉన్నామని అందరూ భావిస్తుంటార…ఈ విషయనికి సంబంధించి కేవలం మన దేశం లో మాత్రమే కాదు.. చాలా దేశాల్లో దీనిపై అవగాహన లేదని చెప్పవచ్చు.

అబ్బో.. దాని వలన పిల్లలు పుడతారని కూడా తెలియని వాళ్ళు ఉన్నారా?

శృంగారానికి సంబంధించి న అవగాహన లేక ఓ జంట  ఎంత  అవస్థ పడ్డారో  ఓక నర్స్ ఇటీవల తాను రాసిన పుస్తకం ద్వారా తెలియచేసారు. ఈ సంఘటన న్యూయార్క్ లో జరిగింది .. వాటి వివరాలు తెలుసుకుందాం…రాచెల్ హియర్సన్ గత 40 సంవత్సరాలుగా న్యూయార్క్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇప్పుడు ఆమె వయ్యస్సు 59 ఏళ్ళు.. ఈ మధ్య  ఆమె తన …అనుభవాలని  ఓక  పుస్తకం ద్వారా అందరి ముందుకు తీసుకు వచ్చారు.  హ్యాండిల్ విత్ కేర్ అని ఆ పుస్తకానికి పేరు పెట్టింది….

ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ రాచెల్ తనకు ఒక కేసు గుర్తుకు వస్తుందని తెలిపారు . ఇక్కడ మీకు ఆమె ఎన్నో కేసు లను చూసి ఉంటారు కాని ఇది ఎందుకు గుర్తు ఉండి ఉంటుందో అని సందేహం కలుగుతుంది. ఇది చదివిన తర్వాత మీకు ఆశ్చర్యం కలగడమే కాదు … మీరు ఎప్పటికి మరిచి పోలేరు.. పెళ్లి జరిగిఏడాది గడుస్తున్నా.. తమకు ఇంకా  పిల్లలు పుట్టడం లేదంటూ ఓ జంట ఆమె పనిచేస్తున్న ఆస్పత్రికి వచ్చారట. సరే పెళ్లి అయ్యాక ఇవన్నీ మాములే కాబట్టి ఏవైనా లోపాలు ఉన్నాయేమో అని ఇద్దరికీ  పరీక్షలు చేశారట. రిపోర్ట్స్ అన్నీ మామూలు గానే వచ్చాయి .

కానీ వాళ్లకు మాత్రం పిల్లలు కలగడం లేదు అని  చెబుతున్నారు ….అప్పుడు ఆమెకు అనుమానం వచ్చి దాంపత్య జీవితం  ఎలా ఉంది అని జంటను ప్రశ్నించిందట. అప్పుడు వారు చెప్పిన సమాధానం విని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. వాళ్లు పెళ్లి చేసుకున్నా గానీ.. ఏ రోజూ  వారు శృంగారంలో పాల్గొనకపోవడం  ఇక్కడ గమనించాలిసిన విషయం .  …పెళ్లి జరిగితేచాలు  పిల్లలు పుడతారని వారు భావించారట. ఎంతకాలనికీ పుట్టకపోవడంతో వైద్యులను కలిశారు.

విచిత్రమేంటంటే.. వారిద్దరికీ పరీక్షలు చేయగా  వర్జిన్స్ అని తేలింది. వాళ్ల ఇంట్లో వారు వాళ్ల కి కనీసం దీని గురించి అవగాహన కల్పించలేదని తెలిసింది….పిల్లలు పుట్టడం లేదని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ.. డబ్బులు ఖర్చు పెట్టారే గానీ.. శృంగారం వలనే పిల్లలు పుడతారని మాత్రం తెలుసుకోలేకపోయారు….అందుకే,పిల్లలకు సెక్స్ విద్య గురించి అవగాహన కల్పించాలని ఆమె తన పుస్తకంలో తెలిపింది..