Acuskinlift: సినీ పరిశ్రమలో నటీమణులకు వారి అందమే వారి ఆస్థి మరియు అస్తిత్వం. ఆలా అని వారి నటనకు ప్రాముఖ్యత లేదు అని కాదు, కమర్షియల్ సినిమాలు బాగా ఉండే భారతీయ సినీ పరిశ్రమలో అందం తరువాతే ఏదైనా. కానీ వయసు మీద పడుతున్న కొద్దీ నటీమణులకు ఎదురయ్యే సవాలు తమ అందాన్ని ఎలా కాపాడుకోవాలి అని, దాని కోసం వారు పడే ఆరాటం మాములుగా ఉండదు. ఇలా అందాన్ని కాపాడుకునే ప్రయత్నం లో ఎన్నో అడ్డ దార్లు తొక్కి ప్లాస్టిక్ సర్జరీ, బోటులినమ్ టాక్సిన్ లాంటి ప్రమాదకర ప్రయత్నాలు విఫలం అయ్యి ఉన్న అందం కూడా పోగొట్టుకున్న తారలు చాలానే ఉన్నారు. అయితే ఇలాంటి ప్రమాదకర మార్గాలకు బిన్నంగా నాచురల్ పద్దతిలో సహజంగా ముఖ కాంతిని పెంచుకునే పద్ధతే అకుస్కిన్ లిఫ్ట్(Acuskinlift).
Acuskinlift: అకుస్కిన్ లిఫ్ట్ అంటే ఏమిటి?
లండన్ కు చెందిన డా. జాన్ త్సాగారిస్(Dr. John Tsagaris) అకుస్కిన్ లిఫ్ట్(Acuskinlift) అనే కాస్మెటిక్ ఫేషియల్ ఆక్యుపంక్చర్ అనే పద్దతి వాడి నాచురల్ పద్దతిలో సహజంగా ముఖ కాంతిని పెంచే ట్రీట్మెంట్ కనుగొన్నాడు. డా. జాన్ త్సాగారిస్ ని అకుస్కిన్ లిఫ్ట్(Acuskinlift) స్థాపకుడు అని అంటారు.
వాట్ ఐస్ అకుస్కిన్ లిఫ్ట్?
ఎలాంటి రసాయనాలు మరియు కృత్రిమ పద్దతి లేకుండా త్సాగారిస్ తన సూదులతో ముఖంపైన గుచ్చుతూ సహజంగా మరియు ప్రభావవంతంగా ముఖ రూపు రేఖలను మారుస్తాడు. చర్మ నిర్మాణాన్ని బిగించడానికి కొల్లాజెన్ ఫైబర్లను బలపరుస్తూ పునర్వ్యవస్థీకరిస్తాడు. ఈ పద్దతి కనుగొనడానికి జాన్ త్సాగారిస్ చైనాకు వెళ్లి మరి పాఠాలు నేర్చుకున్నాడు, అక్కడి ప్రాచీన కళ అయిన ఆక్యుపంక్చర్ ఆధారంగా ఈ పద్దతి కనుగొన్నాడు.
సినిమా అవకాశాలు ఎక్కువగా లేని నటీమణులు ఇలాంటి అకుస్కిన్ లిఫ్ట్ పద్దతి తో అందానికి మెరుగులు పెట్టె పనిలో పడ్డారు, తాజాగా ప్రముఖ సౌత్ ఇండియన్ నటీమణి మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada), ఆమెకే మరో పేరు మెహ్రీన్ కౌర్(Mehreen Kaur) లండన్ వెళ్లి మరీ డా. జాన్ త్సాగారిస్ నుంచి అకుస్కిన్ లిఫ్ట్(Acuskinlift) ట్రీట్మెంట్ చేయుంచుకుంది.
నా ముఖం కోసం మీ అకుస్కిన్లిఫ్ట్ పద్ధతిని ఉపయోగించినందుకు @drjohntsagaris ధన్యవాదాలు త్వరలో దుబాయ్ లేదా లండన్లో కలుద్దాం అని సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది. ఆ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) సోషల్ మీడియా పోస్ట్ మీకోసం ఇక్కడ జతపరిచాం…
View this post on Instagram
Related Articles In Health & Lifestyle:
Diet: మీ బ్లడ్ గ్రూప్ బట్టి వీటిని తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..!
Dill: అర చెంచా ఈ గింజలు ఎముకలను ఉక్కులాగా.. ప్రోటీన్ రక్తహీనత లోపం తగ్గిస్తుంది..!