Adavi Dosakaya: ఈ దోస కాయలు ఎక్కడ కనిపించినా వెంటనే తినేయండి..!! మళ్లీ దొరకకపోవచ్చు..!!

Share

Adavi Dosakaya: : సాధారణంగా ఈ మొక్కని అడవి దోసకాయ, బుడమ కాయ మొక్క, బుడ్డ మెక్క, అడవి టమోటా మొక్క, అని రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు. చిన్నప్పుడు పిల్లలు పల్లెటూళ్లలో వీటినే పండ్లను తెంపి ఇష్టంగా తింటుండేవారు.. చూడడానికి రేగి పండు లాగా చిన్నగా ఉండే ఈ అడవి దోస పండ్లు తినడానికి పిల్లలు బాగా ఇష్టపడే వాళ్ళు.. ఇవి తింటుంటే తీపి, వగరు కలగలిసిన అదోరకమైన రుచికరంగా ఉంటాయి.. వీటిని తినడానికి చాలా టేస్టీ గా ఉండడం వల్ల అందరూ తినడానికి ఇష్టపడుతుంటారు. అడవి టమోటా ను సరదాగా తిన్న కూడా వీటి వల్ల అడవి అనేకమైన పోషక విలువలు ఉన్నాయి.. ఇంతకు ముందు ఇవి తిన్నపూడు అది మనకు తెలియకపోవచ్చు.. అడవి దోసకాయ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదులరు..!!

Adavi Dosakaya: Amazing Benefits for health
Adavi Dosakaya: Amazing Benefits for health

ఈ కాయలు స్ట్రెస్, పంటి నొప్పి, ఉబ్బసం, షుగర్, బిపి, క్యాన్సర్ మలబద్దకం,పిత్త, గ్యాస్ సమస్యలకు చక్కని ఔషధంలా పనిచేస్తుంది.. ఔషధాలకు ఉపయోగపడే ఫినాలిక్స్ రసాయనాలు ఈ మొక్కలు ఉన్నాయి.. కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి, పిత్తాశయ మందుల తయారీలో ఈ మొక్క వేర్లను ఉపయోగిస్తారు. పోషకాలను అందించే ఈ కాయలు తీసుకోవడం ద్వారా కడుపులో ఉండే వ్యర్థపదార్థాలు తొలగిపోతాయి.. చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ కాయలు తినిపించడం ద్వారా నులి పురుగులు పోతాయి. మలబద్దక సమస్యతో బాధపడేవారు ఈ కాయలు తినడం వల్ల దాని నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు. ఈ కాయలు అనేక రకాల పోషక విలువలు, విటమిన్లు ఉన్నాయి. దసరా పూజ లో కూడా ఈ కాయలను ఉంచుతారు.. పూజ ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ కాయలను తింటారు.. అడవి దోస కాయలను తింటే కాన్సర్ కణాలు తొలగిపోతాయి.

Adavi Dosakaya: Amazing Benefits for health
Adavi Dosakaya: Amazing Benefits for health

కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అయితే ఈ యొక్క ఆకులను కూరగా వండుకొని తింటారు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ఈ యొక్క ఆకులను కూరగా వండుకొని ఎంతో ఇష్టంగా తింటారు.. ఈ ఆకులలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి సమస్యల దరిచేర నివ్వదు. కండ్ల మసక, కండ్ల కలక, కంటి శుక్లం తో బాధపడేవారు ఈ ఆకులను కూరగా చేసుకుని తినడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడతారు. కంటి చూపు మెరుగు డంతో పాటు కంటి సమస్యల నుంచి నివారిస్తుంది.

Adavi Dosakaya: Amazing Benefits for health
Adavi Dosakaya: Amazing Benefits for health

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్.. అడవి దోసకాయ వేర్లు షుగర్ వ్యాధిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి.. ఈ మొక్క వేర్ల ను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి కషాయంగా చేసుకోవాలి. ప్రతిరోజు ఈ కషాయాన్ని తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది.. నొప్పులను నివారించే గుణం ఈ మొక్క ఆకులలో ఉంది. ఇది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చక్కటి ఔషధంగా చెప్పొచ్చు.. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ మొక్క ఆకులను తీసుకువచ్చి ముద్దగా నూరుకోవాలి. ఈ ముద్దను నొప్పి ఉన్నచోట ఉంచి గట్టిగా కట్టు కట్టే ఇటువంటి నొప్పి నుంచైనా ఉపశమనం కలుగుతుంది. ఎండాకాలం వస్తే చాలు ఎక్కువమంది సెగ గడ్డ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆకులపై నువ్వుల నూనె , ఆముదం నూనె కానీ రాసి వేడి చేయాలి. వేడి చేసిన ఈ ఆకులు సర్ గడ్డపై పట్టి లాగా వేస్తే నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు. చంటి పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతుంటే ఈ మొక్కల వేర్లను ముద్దగా నురి పొట్టపై లేపనంగా రాయాలి. ఇలా రాయడం ద్వారా కడుపులో ఉండే నులిపురుగులు, వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. శరీరంపై అయినా చిన్న చిన్న గాయాలకు అడవి దోసకాయ రసాన్ని రాయాలి. ఈ కాయలలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి..ఇవి ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయటిక్ గా పని చేస్తాయి.. అంతే కాకుండా గాయం తొందరగా మారడానికి ఈ కాయల రసం దోహదపడుతుంది. ఈ మొక్క రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో ఉండే గ్లైకో ప్రోటీన్ లను తగ్గిస్తుంది.. మీకు ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే ఖచ్చితంగా ఈ కాయలను తినండి. బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి.


Share

Related posts

సర్కారు వారి పాట లో కీర్తి సురేష్ ఎంత అందంగా తయారైందో .. మహేష్ నే డామినేట్ చేసేలా ఉంది..!

GRK

ఐడియా సూపర్ ..డీలింగ్ ఫెయిల్! అచ్చెన్నాయుడు కేసు జగన్ కు యాంటీ అయింది!!

Yandamuri

సైలెంట్ గా మధ్యతరగతి కుటుంబాలపై పెద్ద భారం వేస్తున్న మోడీ సర్కార్..??

sekhar