ప్రజెంట్ ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరూ విటమిన్ సి ,జింక్ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని, న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. పుచ్చకాయ విత్తనాలు జింక్ ఖనిజానికి మంచి వనరు అని చెప్పొచ్చు. ఈ విత్తనాలలో జింక్‌తో పాటుగా, పొటాషియం, రాగి వంటి ఇతర సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. వారానికి 2 నుండి 3 సార్లు సగం టీస్పూన్ పుచ్చకాయ విత్తనాలను తీసుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ విత్తనాలను ఎండబెట్టి, పొడి చేసుకుని మీ భోజనంలో కూడా చేర్చుకోవచ్చు. పుచ్చకాయ విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచడంలోనే కాకుండా, గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిలని సరిగ్గా ఉండేలా చేస్తాయి.
వారానికి కనీసం రెండుసార్లు చేపలు తింటే శరీరానికి జింక్ అందుతుంది. చికెన్, లాంబ్ నాన్ వెజ్ ఐటెమ్స్ కూడా మంచి ఎంపిక. మీ శరీరానికి ప్రతిరోజూ జింక్ కచ్చితంగా అవసరం. ఆరోగ్యకరమైన చర్మం, కళ్ళు, జుట్టు కి కూడా జింక్ ఎంతగానో సాయపడుతుంది. జింక్ ఖనిజాలను ఎక్కువ స్థాయిలో ఉన్న ఆహారాల గురించితెలుసుకుందాం ఒక పెద్ద గుడ్డులో 5 శాతం (0.6 మి.గ్రా) జింక్ ఉంటుంది. కాబట్టి గుడ్లు రెగ్యులర్‌గా తినండి.
పెరుగు మన ఆరోగ్యానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియాను,రోగనిరోధక శక్తికి సరిపడా జింక్ మొత్తాలని అందిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, జనపనార విత్తనాలు, నువ్వుల వంటి విత్తనాలతో పాటు బాదం, వాల్నట్, ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ కూడా మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి. వీలైతే వాటన్నిటిని పొడిలా చేసి పెట్టండి. ఈ మిశ్రమాన్ని స్నాక్స్, సలాడ్స్, డెజర్ట్‌లలో అలంకరించడానికి ఉపయోగించండి. శనగలు తరచుగా మీ భోజనంలో ఉండేలా చూసుకోండి.బెర్రీస్‌లో జింక్ నిల్వలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.