Milk: 1. కూరలో ఉప్పు ఎక్కువగా అనిపిస్తే ..
ఉప్పు ఎక్కువగా అనిపించిన కూర… లో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు లేదా చపాతీ తయారు చేయడానికి పిండి కలుపుతాం కదా ఆ పిండి ముద్దలు కూరలో వేసి కాసేపు అలా ఉంచేస్తే ఇవి ఉప్పును లాక్కుని కూరలో ఉప్పు ను తగ్గిస్తాయి. ఆ తర్వాత కూర వడ్డించేటప్పుడు వాటిని తీసేసి వడ్డించుకుంటే సరి. అదే ఫ్రై లో ఉప్పు ఎక్కువైతే కాస్త శనగ పిండిని నీళ్లలో కలిపి అందులో పోసి మరల కొద్దీ సేపు ఫ్రై అవనిస్తే అప్పుడు ఉప్పు సరిపడా ఉంటుంది.
2. పాస్తా అతుక్కోకుండా ఉండాలంటే..
పాస్తా అతుక్కోకుండా రావాలంటే.. అది ఉడకబెట్టే నీళ్లలో కొన్ని చుక్కలు నూనె వేసుకోవాలి. అది కొంచెం ఉడికిన వెంటనే వేడి నీళ్లు నుంచి తీసి చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే అచ్చం మార్కెట్లో దొరికే పాస్తా లాగే ఉంటుంది .
3. పాలు తోడుపెట్టడానికి ఏమి లేకపోతే…
పాలు బాగా కాచిన తర్వాత గోరువెచ్చగా చేసి అందులో రెండు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఒక పన్నెండు గంటలపాటు అస్సలు కదపకుండా పక్కన పెడితే మంచి గడ్డపెరుగు మీకు అందుతుంది.
రుచి కోసం వెల్లుల్లి ఇలా …
చాలామంది వెల్లుల్లిని కూరల్లో కట్ చేసి వేస్తుంటారు. కానీ దీని బదులు పేస్ట్ వేయడం వల్ల వెల్లుల్లి రుచి, వాసన ఆ వంట కి బాగా పడుతుంది.
5. టీ పొడి తో క్లీనింగ్ …
టీ పొడి తో పళ్ళు రుద్దుకున్న… అద్దాలను రుద్దిన బాగా మెరిసిపోతాయి. కాబట్టి టీ పెట్టిన తర్వాత టీ పొడిని పక్కన పెట్టి దీంతో అద్దాలు, చెక్కతో చేసిన వస్తువులు శుభ్రం చేయడం వల్ల అవి మెరుస్తుంటాయి.
6. అన్నం పొడి పొడిగా ..
అన్నం వండేటప్పుడు అందులో నాలుగు లేదా ఐదు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి తే మెతుకులు అతుక్కోకుండా అన్నం పొడిపొడిగా ఉంటుంది. వస్తాయి.
7. నిమ్మరసం లో
నిమ్మరసం చేసేటప్పుడు రసంతో పాటు నిమ్మ చెక్కలను కూడా ఆ రసం లో వేసి కాసేపు ఉంచితే మంచి వాసన , రుచి తో పాటు పోషకాలు కూడా బాగా అందుతాయి .