దాల్చిన చెక్క టీలో యాంటీఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ చాలా ఉంటాయి. అవి మన శరీరాన్ని రకరకాల వ్యాధులు సోకకుండా కాపాడతాయి.
దాల్చిన చెక్క అలాగే నీటిలో ఉడకపెట్టవచ్చు లేదా పౌడర్‌గా చేసుకొని… టీ తయారు చేసుకోవచ్చు . దాల్చినచెక్క టీ కి చాలా ఔషధ గుణాలున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, బీపీ కంట్రోల్లో ఉండాలన్నా ,బరువు తగ్గాలన్నా,, పీరియడ్స్ సక్రమంగా జరగాలన్నా, కడుపులో వచ్చే మంట వంటివి పోవాలన్నా, దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ తాగితే మంచిది. నడుం చుట్టూ రింగులా ఉండే కొవ్వు కరిగిపోవాలంటే… దాల్చిన చెక్క టీ తాగాలన్నది నిపుణుల సలహా.
త్వరగా ముసలి తనం రాకుండా ఉండాలనుకుంటే… కూడా ఈ టీ తాగండి. చర్మం, ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ టీ తాగితే ప్రయోజనాలు బాగా ఉంటాయి. షుగర్, కేన్సర్, గుండె జబ్బులు, చర్మ కణాలు దెబ్బతినడం వంటి సమస్యలకు దూరం గా ఉంచుతుంది . మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో దాల్చిన చెక్క టీ అంత సమర్ధవంతమైనది ఇంకొకటి లేదు. అదే సమయంలో మంచి కొవ్వును పెంచుతుంది.
గుండెకు హాని జరగకుండా చేస్తుంది. మెదడు బాగా పనిచెయ్యాలన్నా, మతిమరపు ను దూరం చేయాలన్న ఈ టీ తాగాల్సిందే. దాల్చిన చెక్క పొడి ఉదయాన్నే తాగే కాఫీ లేదా టీ లో కలుపుకొని తాగాలి. పళ్ల రసాల్లోనూ ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగవచ్చు.. ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో, ఆన్లైన్లో సిన్నమోన్ టీ బ్యాగులు కూడా దొరుకుతున్నాయి. వాటిని కొనుక్కొని తాగినా ప్రయోజనం ఉంటుంది. ఓ కప్పు వేడి నీటిలో ఓ టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి, సరిపడా చక్కెర వేసి కలపాలి. దాన్ని ఫిల్టర్ చేసి తాగాలి.
దాల్చిన చెక్కలను వేడి నీటిలో 10 నుంచీ 15 నిమిషాలు ఉంచి… ఆ నీరు తాగినా సరిపోతుంది. గర్భిణీలు, ఆరేళ్ల లోపు పిల్లలు దాల్చిన చెక్కను ఆహారంతో తీసుకోకపోవడం మంచిది. పేగు సమస్యలు, కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారు దాల్చిన చెక్కను తీసుకోవద్దు. చర్మం మంటగా ఉన్నా, అలర్జీలు ఏర్పడినా, తీసుకోవడం మానేయండి.