Eating: నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా ఆరోగ్యంపై అనేక రకాల సమస్యలు ప్రభావం చూపుతున్నాయి.. ఆరోగ్యంగా ఉండటానికి, శారీరకంగా చురుకుగా ఉండటం చాలా అవసరం.. మనలో చాలా మంది ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోతారు.. దీని వలన ఆహారం సరిగా జీర్ణం కాక జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.. ఆహారం తీసుకున్న తర్వాత కచ్చితంగా వ్యాయామం చేయాలి.. ఇలా చేస్తే కొన్ని రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయవచ్చు.. ఏం చేయాలంటే.!?

భోజనం తిన్న తర్వాత కనీసం పదినిమిషాల పాటు నడవాలి. ముఖ్యంగా 8 ఆకారంలో నడిస్తే చాలా మంచిది. ఇలా తిన్న వెంటనే నడవడం ద్వారా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఉదర సంబంధిత సమస్యలు రావు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. దాంతో సులువుగా బరువు తగ్గుతారు. భోజనం చేసిన తర్వాత అడ్మింటైన్ భంగిమలో కూర్చోవడం ద్వారా ఆహారం త్వరగా అరుగుతుంది. భోజనం తర్వాత ఇది ఉత్తమ వ్యాయామంగా ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

ఆహారం తిన్న తర్వాత సుఖాసనంలో కూర్చుంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. సుఖాసనంలో కేవలం ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే కూర్చోవాలి. ఆ తర్వాత కనీసం ఐదు నిమిషాల పాటు నడవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా రోజంతా ఆక్టివ్ గా ఉంటారు. గోముఖాసనం, వజ్రాసనం, క్యాట్ అండ్ కౌ ఆసనాలు కూడా తిన్న తర్వాత వేస్తే చాలా మంచిది.