ఇది చదివిన తర్వాత మీ వాళ్ళకి షేర్ చేయకుండా ఉండలేరు!!

ఇడ్లీ, దోశె, పూరి, బజ్జీ లాంటి వాటిని న్యూస్ పేపర్ లో పెట్టి ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఆహార పదార్థా లను కట్టి ఇచ్చేటప్పుడు న్యూస్ పేపర్  ను వాడడం వలన ముద్రణకు ఉపయోగించే సిరాలో ఉండే రసాయనాలు అహారాన్ని విషపూరితంగా మార్చడం వలన క్యాన్సర్కి  దారి తీసే ప్రమాదం ఉన్నందున వీటిల్లో ఆహార పదార్థాలను పెట్టి ఇవ్వకూడదని తెలిపింది.

ఇది చదివిన తర్వాత మీ వాళ్ళకి షేర్ చేయకుండా ఉండలేరు!!

పత్రికల ముద్రణ కోసం వినియోగించే సిరాలో హాని కరమైన రంగులు, వాటి అవశేషాలు,  రసాయనాలు ఉంటాయి. అంతే కాకుండా సిరా లో ఉండే వ్యాధికారక సూక్ష్మజీవుల రసాయనాలు మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపింది. రీసైకిల్ చేసిన పదార్థాలతో పేపర్లు లేదా కార్డ్‌బోర్డ్ పెట్టెలను తయారు చేస్తారు. అలా తయారుచేసిన వాటిలో ఉండే హాని కలిగించే రసాయనాల వల్ల  జీర్ణ సంబంధ సమస్యలకు, తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయి. న్యూస్ పేపర్లల తో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తీసుకున్న చిన్నపిల్లల్లో,వృద్ధులు, యువకులలో, కేన్సర్ సంబంధ వ్యాధులు కూడా సంభవిస్తాయని తెలిపింది.

ఆహార భద్రతా ప్రమాణాలను తదుపరి స్థాయి కి తీసుకెళ్లేందుకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి తెలిపారు. అయితే ప్రైవేట్ పరమైన వాటిలో ఈ నిబంధనలు అమలు చేయడం కష్టమే నని అందుకే ప్రజల్లో తగిన అవగాహన కల్పించేందుకు ప్రతి చోట దీని గురించి బోర్డు పెట్టాలి అని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆహార పదార్థాలను  రసాయనాలు, సూక్ష్మజీవులు, వాతావరణ పరిస్థితుల నుండి, కాలుష్య ప్రభావం నుంచి సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా ప్యాకేజ్ ఉండాలని పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకుని ఆహారం పేపర్ లో తెచ్చుకోకుండా ఇవ్వనివ్వకుండా అవగాహన కల్పించడం లో అందరు కృషి చేయాలి.