Knee Pain: ఈ రోజుల్లో మూడు పదుల వయసు లోనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు, కండరాల క్రాంప్స్ వంటి రకరకాల శారీరక నొప్పులు తో అనేకమంది బాధపడుతున్నారు.. ఈ నొప్పి ఎక్కువ అయ్యి సయాటికాకు దారితీస్తుంది. దాంతో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఇలాంటి నొప్పులను ఇకమీదట భరించిన అవసరం లేదు. అందుకు ప్రత్యామ్నాయలు ఉన్నాయి..

ఇండో బ్రిటిష్ అడ్వాన్డ్స్ పెయిన్ క్లినిక్‌లోని డాక్టర్లు.. లేటెస్ట్ టెక్నాలజీ తో ఆపరేషన్ తో పని లేకుండా మోకాలని పునర్జీవం చేసే నొప్పిని దీర్ఘకాలం దూరం చేసే పలుమార్గాలు ఉన్నాయి. పెద్దవారికి ఇది మంచిది కాదు.. రీజనరేటివ్ థెరపీ మోకాళ్ళలోని కార్టిలేజ్‌ని పునరుత్పత్తి చేసే ప్రక్రియలో, సొంత రక్తం నుంచి వేరు చేసిన పదార్ధాలను ఉపయోగిస్తారు. ఈ పదార్ధాలలో ప్రధానమైనవి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పీఆర్‌పీ, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ మరియు స్టెమ్ సెల్స్, అలాగే ఎముకలోని మజ్జ నుంచి కానీ, కొవ్వు కణజాలం నుంచి కానీ మూలకణాలను వేరు చేసి మోకాళ్లలో ప్రవేశపెట్టినప్పుడు కార్టిలేజ్ యొక్క పునరుత్పత్తి సాధ్యమవుతుంది.
కొంతమందిలో జాయింట్ లోని సైనోంగిల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్ధం విడుదల తగ్గిపోతుంది. దీనిని ఇంజక్షన్ ద్వారా తీసుకోవచ్చు. తీవ్రమైన మోకాలు నొప్పులను కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్, ప్రోలోథెరపీ వంటి ఆధునాతన పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు. డిజిటల్ స్పైనల్ ఎనాలసిస్ వంటి అధునాతన పద్ధతుల ద్వారా నొప్పి ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. బయాక్యులో ప్లాస్టి న్యూక్లియోలైసిన్ వంటి పద్ధతుల ద్వారా డిస్క్ యొక్క అరుగుదలను తద్వారా స్పైన్ ఆపరేషన్‌లను నిరోధించవచ్చు.
నడుములోని చిన్న జాయింట్స్ అయినా ఫెసెట్స్ నుంచి వచ్చే నొప్పిని రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ ద్వారా దీర్ఘకాలం అరికట్టవచ్చు. ఫెయిల్ అయిన వెన్ను ఆపరేషన్ తర్వాత వచ్చే మొండి నొప్పులకు ఎపిడ్యూరోస్కోపీ స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ లేక స్పైనల్ పంప్స్ ఆధారంగా నొప్పికి రిలీఫ్ పొందవచ్చు.