న్యూస్ హెల్త్

ఆలు మసాలా పూరి ఇలా చేస్తే సూపర్ టేస్టీగా వస్తాయి..!!

Share

పూరి ఈ పేరు చెప్పగానే కొంతమంది నోట్లో లాలాజలం ఊగుతుంది.. రోజు పూరి పడితే హాయిగా లాగించేస్తామంటారు కొందరు.. మరి కొంతమంది ఆయిల్ ఫుడ్ అంటూ మనసులో ఇష్టం ఉన్న బయటకు మాత్రం వద్దు అని చెప్పేస్తారు.. పూరి ప్రియులందరికీ.‌. ఆలు మసాలా పూరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఆలు మసాలా పూరి తయారీకి కావలసిన పదార్థాలు..

గోధుమపిండి ఒక కప్పు, ఉడికించిన బంగాళదుంప ఒకటి, ధనియాల పొడి, ఇంగువ పావు చెంచా, పసుపు, ఆవాలు, కారం కూడా పావు చెంచా చొప్పున, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత..

 

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి మెత్తగా ఉడికించిన బంగాళదుంప వేసి కలిపి ముద్దలా చేసుకోవాలి.. ఇందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి , ఇంగువ, ఆవాలు వేసి మరోసారి కలుపుకోవాలి.. చివరిగా కొద్దిగా ఉప్పు, వేడి చేసిన ఒక చెంచా నూనె కూడా వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి.. ఇప్పుడు ఈ పిండిని పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి..

 

ఆ తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల మాదిరిగా ఒత్తుకోవాలి. మరో పక్క స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని అందులో నూనె పోసి బాగా వేడెక్కించాలి. నూనె వేడెక్కాక ముందుగా సిద్ధం చేసుకున్న పూరీలను నూనెలో వేసుకుని తీసుకోవాలి. అంతే ఆలు మసాలా పూరి తినటానికి రెడీ. ఇందులోనే అన్ని ఇంగ్రిడియంట్స్ వేసాం కాబట్టి ఈ పూరీలను నేరుగా తినవచ్చు. లేదు మీకు కర్రీ కావాలి అనుకుంటే బంగాళదుంప కర్రీ, మిల్ మేకర్ కర్రీ తో ఆలు మసాలా పూరిని ఇష్టంగా లాగించేసేయండి..


Share

Related posts

Bigg Boss 5 Telugu: రవిని బురిడీ కొట్టించిన శ్రీ రామ్ చంద్ర..!!

sekhar

గ్రేటర్ లో గులాబీ పార్టీ కి…MIM తో పొత్తు తప్పదా ?

sekhar

మీరే స్వరకర్తలు కావచ్చు..! స్వర ప్రపంచం మీకు స్వాగతం పలుకుతుంది..!

bharani jella