NewsOrbit
న్యూస్ హెల్త్

Aloe Vera Gel: అలోవెరా జెల్ కొనవద్దు, విటమిన్ E కలుపుకొని కలబంద తో చక్కటి మిశ్రమం ఇంట్లో తయారు చేసుకోండి, మొటిమలు(Acne) మరియు మచ్చలు ఇక ఉండవు!

Alovera Gel preparation on flax seeds and vitamin E capsules

Aloe Vera Gel: సహజంగా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మన అందాన్ని ఇనుముడింప చేయడంలో అలోవెరా జెల్ అద్భుతంగా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. చర్మ సంరక్షణ విషయంలో అలోవెరా జెల్ కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ సంరక్షణ, మచ్చలు, మొటిమలు, యాక్నే, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవడం వంటి వాటికి అలోవెరా జెల్ మంచి మెడిసిన్. ఈ జెల్ సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్. అయితే అలోవెరా జెల్ బయట కొనుక్కోవడం కంటే కూడా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Alovera Gel preparation on flax seeds and vitamin E capsules
Alovera Gel preparation on flax seeds and vitamin E capsules

అలోవెరా జెల్ తయారీ విధానం.!
కావల్సిన పదార్థాలు..
కలబంద గుజ్జు – అరకప్పు, అవిస గింజలు అరకప్పు, విటమిన్ ఇ క్యాప్సిల్స్ -4.

ముందుగా కలబంద మట్టలను తీసుకుని శుభ్రంగా కడిగి అందులో నుంచి కలబంద గుజ్జును తీసుకోవాలి ఈ గుజ్జును మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ మిశ్రమం వేసి ఉండలు ఉండలుగా లేకుండా ఈ గుజ్జును మరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి.

ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని పోసుకొని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగాక అందులో అవిసె గింజలను వేసుకొని పది నిమిషాల పాటు అవిసె గింజలను ఉడికించుకోవాలి. అవిసె గింజలు ఉడికేటప్పుడే మిశ్రమం దగ్గర పడుతూ జెల్ లాగా రావడం కనిపిస్తుంది. అలా జెల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత కాటన్ క్లాత్ లోకి అవిసె గింజల మిశ్రమం వేసి జెల్ ను మరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు అవిసె గింజల జెల్, ముందుగా మిక్సీ పట్టుకున్న కలబంద మిశ్రమం రెండింటిని మళ్లీ మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా కట్ చేసి ఇందులో వేయాలి. ఈ మూడింటిని కలిపి మరోసారి మిక్సీ పట్టుకోవాలి . ఈ మిశ్రమాన్ని మరలా కాటన్ క్లాత్ లోకి వేసుకొని వడకట్టుకోవాలి. అంతే అలోవెరా జెల్ సిద్ధమైనట్లే.. ఈ మిశ్రమం 20 రోజులపాటు పాడవకుండా ఉంటుంది ఫ్రిజ్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు.

సహజ సిద్ధంగా తయారు చేసుకున్న ఈ అలోవెరా జెల్ ఉదయం సాయంత్రం ముఖానికి రాసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ముఖం మీద మచ్చలు, మొటిమలు, యాక్నే తొలగించి ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేయడానికి సహాయపడుతుంది. కలబంద జెల్ అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు జుట్టును కూడా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అలోవెరా జెల్ చర్మంతో పాటు జుట్టు కూడా మెరిసేలా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju