Curd: పెరుగు ఆరోగ్యానికి మంచిదని తినమని ఆరోగ్య నిపుణులు పదేపదే చెబుతూ ఉంటారు.. పెరుగు లేనిదే కొంత మందికి భోజనం తిన్న సంతృప్తి కలగదు.. కొందరికైతే పెరుగు వాసన పిలిస్తేనే పడదు.. ఆవు, గేదె పాలతో తయారు చేసిన పెరుగు మీకు పడదా.. అయితే ఇదిగో ప్రత్యామ్నాయాలు..!
సోయాలో ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను అందించడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. సోయా గింజలను పన్నెండు గంటలపాటు నానబెట్టి వాటిని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టి పాలను తీసుకోవాలి. వాటిని మరిగించి సాధారణంగా పెరుగు ఎలా తోడు పెడతామో వీటిని కూడా అలాగే తోడు పెట్టాలి. 100 గ్రాముల సోయా గింజలతో చేసిన పెరుగు ఇంటిల్లపాదికీ సరిపోతుంది. ఈ పెరుగును తీసుకుంటే బీపి కంట్రోల్ అవుతుందని పలు రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ను తగ్గిస్తుంది. అన్ని రకాల కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది..
కొబ్బరిపాల పెరుగు సాధారణ పెరుగుకు మరొక ప్రత్యామ్నాయం.. మనందరికీ కొబ్బరి పాలు తయారు చేసుకోవడం ఎలాగో తెలుసు. వాటిని కూడా సాధారణ పాలులా కాచి పెరుగు తోడు వేయాలి. ఈ పెరుగు కూడా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పైగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాల్లో నిరూపితమైంది. ఇప్పటినుంచి ఆవు, గేదె పాల పెరుగు వద్దు అనుకునే వారికి ఈ రెండు రకాల పెరుగు ఇచ్చి చూడండి.. ఒకసారి వీటి రుచి చూస్తే ప్రతిసారీ ఈ పెరుగును తినడానికి ఇష్టపడతారు.