న్యూస్ హెల్త్

Aluu: బంగాళాదుంప మజ్జిగ పులుసు ఒక్కసారి టెస్ట్ చేస్తే అస్సలు వదలరు..!

Share

Aluu: మజ్జిగతో పులుసు, రకరకాల వంటకాలు చేస్తూ ఉంటాము.. ఈ రోజు అదే మజ్జిగతో బంగాళదుంపను కలిపి స్పైసీ వంటను తయారు చేద్దాం.. బంగాళాదుంప మజ్జిగ పులుసు తినడానికి చాలా రుచిగా ఉంటుంది.. ఒక్కసారి ఈ వంట రుచి చేస్తే అస్సలు వదలరు.. ఆలూ మజ్జిగ పులుసు కు కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం..!

Aluu: Majjiga Pulusu Recipe
Aluu: Majjiga Pulusu Recipe

ఆలూ మజ్జిగ పులుసు కు కావలసిన పదార్థాలు:

బంగాళదుంపలు పావుకిలో, ఒక కప్పు పెరుగు ను మజ్జిగ చేసుకోవాలి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, కొత్తిమీర ఒక చెంచా, నాలుగు చెంచాల నూనె, కరివేపాకు ఒక రెబ్బ , ఒక చెంచా కారం పొడి, చిటికెడు పసుపు, ఒక స్పూన్ గరంమసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచా ధనియాల పొడి, రెండు పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు నాలుగు, మామిడికాయ పొడి ఒక చెంచా.

Aluu: Majjiga Pulusu Recipe
Aluu: Majjiga Pulusu Recipe

ముందుగా బంగాళదుంపలను పూడిక పెట్టుకుని పొట్టు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యిమీద బాండీ పెట్టి నూనె వేసి పోపు పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ , పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి దోరగా వేయించాలి. ఇందులో బంగాళదుంప ముక్కలను వేసుకుని అందులో ఉప్పు, పసుపు, కారం వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి . తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, మామిడి కాయ పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఇప్పుడు ఇందులో మజ్జిగ పోసి కలపాలి. అంతే స్పైసీ ఆలూ మజ్జిగ పులుసు రెడీ..


Share

Related posts

వ‌ర్షాకాలం… వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్‌తో మీ పిల్ల‌లు జాగ్ర‌త్త సుమీ..

Teja

దీపావళి స్పెషల్ వంటకాలు ఇవే..!

Teja

WhatsApp: ఇక నుండి వాట్సాప్ లో కూడా ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఫీచర్స్ తెలియజేసిన మార్క్ జుకర్ బర్గ్…!!

sekhar