Green Peas: పచ్చి బఠాణి.. ఈ గ్రీన్ పీస్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ప్రతిరోజు పచ్చిబఠానీ తినటం వలన కంటి సమస్యలు దరిచేరవని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పచ్చి బఠానీలోని ల్యూటిన్, జియాగ్జాంతిన్ అనే కెరోటినాయిడ్స్ కళ్లని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆధునిక కాలంలో ఎక్కువమంది కంప్యూటర్స్ లాప్ టాప్స్, ఫోన్లు స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణం కళ్ళు దెబ్బ తినకుండా ఈ బటాని కాపాడుతుంది..

పచ్చి బఠాణి ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి.. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరుకోకుండా అడ్డుకుంటాయి.. ఈ పచ్చి బఠానీలలో ఉండే పొటాషియం, మెగ్నీషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది.. ఇంకా ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఇ, జింకు వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.. ఇవి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రిస్తుంది.. రోజు ఈ పచ్చి బఠాణి క్రమం తప్పకుండా తినటం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. పచ్చి బఠాణి లో మన శరీరానికి ఉపయోగకరమైన యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఆరోగ్యానికి మేలుకు కలిగించే న్యూట్రియెంట్లు కూడా కలిగి ఉన్నాయి.
పచ్చి బటానిలో ఉండే ఫైబర్ గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్లు రాకుండా చూడడమే కాకుండా శరీరంలోని షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.. ఈ పచ్చి బఠాణీలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలి అని అనుకునే వారికి ఇది చక్కని ఎంపిక అని చెప్పవచ్చు.. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకోవడం మే కాకుండా ఎక్కువ ఆహారాన్ని తినకుండా కూడా నియంత్రించవచ్చు.. పచ్చిబఠానీలు లో కెరోటిన్ ఉంటుంది.. ఇది కళ్ళలోని శుక్లాలు రాకుండా చూస్తుంది.. కంటి చూపును మెరుగు పరుస్తుంది. పచ్చిబఠానీలను డైలీ ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణ సమస్యలు ఉండవు.. ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తొలగిస్తుంది.. తద్వారా జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.