Chamoline Tea: ఈ టీ తో డయాబెటీస్ కు చెక్..!!

Share

Chamoline Tea: ఈ సీజన్ లో చామంతి పూలు విరివిగా లభిస్తాయి.. పూజకు, అలంకరణకు, తలలో పెట్టుకోడానికి మాత్రమే ఈ పూలు ఉపయోగపడతాయి అనుకుంటే పొరపాటే.. చామంతి పూలు తో టీ తయారు చేసుకుని తాగితే చక్కటి రుచి తోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం.. ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో..!? ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!

Amazing Health Benefits Of Chamoline Tea:
Amazing Health Benefits Of Chamoline Tea:

ముందుగా చామంతి పూలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో ఈ పొడిని వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకోవాలి. అంతే చామంతి పూల టీ సిద్ధం. ఈ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, ఇన్సులిన్ ను రెగ్యులేట్ చేస్తుంది. అందువలన డయాబెటిస్ ఉన్నవారు చామంతి టీ ని ప్రతిరోజు తీసుకోండి. ఇందులో కేలరీలు కూడా తక్కువే. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడమే కాకుండా అధిక బరువు ను కూడా తగ్గిస్తుంది.

Amazing Health Benefits Of Chamoline Tea:
Amazing Health Benefits Of Chamoline Tea:

చామంతి టీ లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ టీ తాగితే మనసు పై సానుకూల ప్రభావం చూపి మానసిక ఒత్తిడి ని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కండరాల నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది.


Share

Related posts

 RRR : ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ 2022లోనా..?

GRK

తిరుపతి ఉప ఎన్నిక :ఊపుమీదున్న వైసిపి!!

Yandamuri

అలా ఫోటో తీసుకున్న కోహ్లీ, అనుష్క.. నెట్టింట వైరల్!

Teja