Tamoto: టమాటా లేని వంటిల్లు, పెరటి తోట ఉండదంటే అతిశయోక్తి కాదు.. కూర ఏదైనా అందులో టమాటా పడాల్సిందే.. సాధారణంగా మనం టమాటాలు అనగానే ఎర్రటివి, పండిన టమోటాలను మాత్రమే ఉపయోగిస్తాం.. మరి పచ్చి టమాటాలు కనిపిస్తే పక్కన పడేస్తాం కానీ.. అవే గ్రీన్ టమాటాలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..!?

ఆకుపచ్చని టమాటోలు లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆయా సీజన్లలో వచ్చే ఇన్ఫెక్షన్, వైరస్ కారక క్రిములను మన శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. పచ్చి టమాటా లలో సోడియం తక్కువ, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది అధిక రక్తపోటు ను నియంత్రణలో ఉంచుతాయి. పచ్చి టమోటాలు తినటం వలన ఆరోగ్యానికే కాదు అందం కూడా.. ఇందులో ఉండే విటమిన్ సి వృద్ధాప్య ఛాయలను తొలగించి నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. గ్రీన్ టమోటాలో ఉండే విటమిన్ సి ముడతలు ఏర్పడకుండా చేస్తుంది.
Read More :Tingling sensation: కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా..!? నీళ్లలో ఇది వేసుకుని తాగండి..

పచ్చి టమోటో లో విటమిన్ కె ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టనివ్వదు. సక్రమంగా బ్లడ్ సర్కులేషన్ జరిగేలా చేస్తుంది. బ్లడ్ క్లాట్స్ కాకుండా చేస్తుంది. పచ్చి టమోటా లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లకు మేలు చేస్తుంది. వీటిని తినటం వలన కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. చూశారుగా పచ్చి టమోటాలు వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. ఇక నుంచి మీరు కూడా వీటిని తినండి.