హెల్త్

Blood Pressure: బీపీ కోసం పొద్దున్నే వేసుకునే టాబ్లెట్ ఈ సమయంలో తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది!!

Share

Blood Pressure: ఈ మధ్య  కాలంలో లో బీపీ లేదా హై బీపీ  తో  చాలామంది  సమస్యలు ఎదురుకుంటున్నారు. పైకి చూడడానికి మనిషి బాగానే కనిపించిన..చాలా ఎక్కువ  మందిలో ఈ సమస్య  ఉంది. ఆహారం ఎక్కువగా   ఉప్పు, మసాలా  తినడం తో పాటు పచ్చళ్లు  ఎక్కువగా  తినడం, మందు తాగడం, ఒత్తిడి, ఆందోళన తో మధ్య గడుపుతున్న తీరిక లేని జీవితం , సమయానికి సరైన పౌష్టికాహారం  తీసుకోకపోవడం… దీనికి తోడు  వ్యాయామం  చేయకుండా గడిపేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బీపీ పెరుగుదలకు కారణాలు  చాలా  కనిపిస్తాయి.బీపీ వచ్చాక    తగ్గించుకోవ‌డానికి మందులు వాడుతుంటారు.

అయితే బీపీ ఉన్నవారు రాత్రి సమయంలో టాబ్లెట్ తీసుకోవడం వల్ల  మంచి  ఫలితాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు.  బీపీ  సమస్య ఉన్నవారు   ఉదయం లేవగానే పరగడుపున మందులు వేసుకుంటారు . అయితే ఈ పద్ధతి కన్నా రాత్రుళ్లు ఈ  టాబ్లెట్స్ వేసుకుంటేనే బీపీ అదుపులో ఉంటుంది అని  స్పెయిన్ పరిశోధకులు సూచిస్తున్నారు. బీపీ టాబ్లెట్  రాత్రి నిద్రపోయే ముందు తీసుకుంటే..  బీపీని అదుపులో ఉంచడం తో పాటు   గుండె సంబంధించిన సమస్యలకు  గురయ్యే ప్రమాదం  బాగా తగ్గిందని పరిశోధకులు తేల్చి చెప్పారు.

ఇంచుమించుగా  ఆరేళ్ల పాటు 19,000 మందిపై  పరిశోధన చేసి  ఈ వివరాలను తెలియజేశారు. హైపర్ టెన్షన్ ని  అదుపు చేస్తూ  కాంప్లికేషన్స్   రాకుండా చేయడం లో  ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది.  హైబీపీ ఉండి గుండె జబ్బులు వచ్చే రిస్క్   ఉంది అనుకున్నవారు  ఆహారంలో ఉప్పు బాగా తగ్గించుకోవాలి. రోజు లో  1500 – 2300 మిల్లీగ్రాముల మధ్యలో ఉండేలా మాత్రమే  ఉప్పు తీసుకోవాలి.   ప్యాకేజ్డ్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్స్ తగ్గించి ఇంట్లోనే అప్పటికప్పుడు  ఫ్రెష్ గా వండుకోవడం మంచిది.


Share

Related posts

రక్తహీనత, ఊబకాయానికి చక్కటి పరిష్కార మార్గం ఇదే..!

Teja

sentiments: కొన్నిసార్లు పనులు మొదలు పెట్టడానికి మంచి ముహూర్తము చూసుకున్న అవి తప్పిపోతుంటాయి…దానికి కారణం ఇదే!!

siddhu

Nalleru: పరిశోధకులను ఆశ్చర్యపరిచిన నల్లేరు మొక్క గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!!

bharani jella