Annatto: అన్నట్టో విత్తనాలు దీని గురించి ఎవ్వరూ పెద్దగా విని ఉండరు.. ఈ అన్నట్టో విత్తనాల నుంచి ప్రకృతి పరంగా హాని లేకుండా రంగులను సేకరించి ఆహార పదార్థాలకు కలుపుతారు.. అన్నట్టో విత్తనాల వలన పది రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

అన్నట్టో విత్తనాల వలన కలిగే ఆరోగ్య లాభాలు..!
ఈ విత్తనాలను నానబెట్టి మెత్తగా రుబ్బుకొని మిశ్రమంగా చేసుకోవాలి.. ఈ పేస్ట్ ను ఆహార పదార్థాలలో కలుపుకోవడం వలన ఎరుపు, గులాబీ, పసుపు వంటి రంగులుగా చేసుకోవచ్చు. ఈ విత్తనాలను వేయించి పొడి చేసి సలాడ్, మొలకలు పై చల్లుకొని తీసుకోవచ్చు. ఈ పొడి కాస్త తీయగాను కాస్త ఘాటుగాను అనిపిస్తుంది. ఈ విత్తనాలను మన ఆహారాలలో ఉపయోగించడం ఆరోగ్యదాయకం, శ్రేయస్కరం. పైగా ఇందులో ఎటువంటి హానికరమైన రసాయనాలను ఉపయోగించినందున.. మన ఆహార పదార్థాలకు చక్కటి రంగును అందించడంతోపాటు రుచిని కూడా కలిగిస్తుంది. ఈ విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అన్నట్టో విత్తనాలలో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ , ఫోలిక్ యాసిడ్ , పీచు పదార్థాలు ఉంటాయి.
1. షుగర్ బీపీ, ఉన్నవారికి క్రమక్రమంగా కంటిచూపు తగ్గుతూ వస్తుంది.. కంటి లోపల ఉండే రెటీనా పొరల లోపల ఉండే రక్తనాళాలను ఉబ్బడం, చిట్లడం వలన చూపు తగ్గుతుంది. అన్నట్టో విత్తనాలు రేటినోపతిని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడతాయి..
2.గ్యాస్టిక్, జ్వరం, ఉబ్బసం, ఆయాసం, జీర్ణ సంబంధిత సమస్యలు, అతి సార వ్యాధి వంటి సమస్యల బారిన పడకుండా ఈ విత్తనాలు మనల్ని కాపాడతాయి.
3.మన శరీరంలోకి సూక్ష్మ క్రిములు వైరస్ ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రయను క్రమబద్ధీకరిస్తుంది.
4.ఎముక పట్టుత్వాన్ని పెంచుతుంది. కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు కూడా నివారిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే ఎముకలు పెళుసు బారడాన్ని తగ్గిస్తుంది.
5.గర్భవతులకు గర్భం లోపల ఎదుగుతున్న పిల్లల సౌష్టవ లోపాలను సరిచేస్తుంది. అన్ని అవయవాలు సక్రమంగా ఏర్పడే విధంగా దోహదపడుతుంది.

6. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రే చీకటిని వివరిస్తుంది.
7.వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా కాపాడుతుంది. వృద్ధాప్యంలో వెంట్రుకలు తెల్లబడతాయి. ఈ విత్తనాలు తీసుకోవడం వల్ల వెంట్రుకలు తెల్ల బడకుండా నల్లగా నిగనిగ లాడే లాగా చేస్తుంది.
8.చర్మ సౌందర్యాన్ని ఇనుముడింప చేస్తుంది. చర్మం కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తుంది..
9. గాయాలు ఏవైనా అయినా కూడా అవి త్వరగా మానిపోయేలా చేయడానికి ఈ విత్తనాలు సహాయపడతాయి. మానిన గాయాల తాలూకు మచ్చలు రాకుండా చేస్తుంది. అందుకు ఈ విత్తనాలను మెత్తగా పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు అయినచోట రాసుకోవాలి.
10.గ్యాస్ ట్రబుల్స్ ఉన్నవారు ఈ విత్తనాల తీసుకోవడం వలన పుల్లని త్రేన్పులు రాకుండా ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది.
11. శరింలోని ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
అందుకని మనం వండే వంటలలో అది శాఖాహారమైన మాంసాహారమైన కానీ స్వీట్లలో రసాయనిక రంగులను వినియోగించడం ద్వారా మనకి నరాల బలహీనత, క్యాన్సర్, జీర్ణ కోశ సమస్యలు వస్తాయి. ఈ అన్నట్టో విత్తనాలు ఉపయోగిస్తే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విత్తనాలు ఆన్లైన్లో కూడా అందరికీ దొరుకుతాయి. మీకు మీరు వండే వంటల్లో కెమికల్స్ ఉన్న కలర్స్ ను కాకుండా అన్నతో విత్తనాలను మాత్రమే ఉపయోగిస్తే మీ ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.