Sugar : పంచదారకు బదులు ఈ పదార్ధాలను కూడా వాడుకోవచ్చు..
స్టీవియా: స్టీవియా అనే మొక్క ఆకుల నుండి దీనిని తయారుచేస్తారు. ఇది సహజమైన తియ్యదనం కలిగి ఉంటుంది. దీనిలో కెలొరీస్ జీరో. ఇది ఈ మధ్య కాలంలో బాగా ప్రసిద్ధి చెందినది అనడం లో సందేహమే లేదు. దీని గ్లైసమిక్ ఇండెక్స్ (GI)- 0 ఉండటం వలన బ్లడ్ షుగర్ లెవెల్ ను పెంచడం జరగదు. బరువు తగ్గించుకోటానికి అద్భుతం గా పనిచేస్తుంది. స్టీవియా మాత్రల రూపంలో, పొడి రూపంలోనూ మార్కెట్లో అందుబాటులో ఉంది.
Sugar : కొబ్బరి పంచదార:
కొబ్బరి కాయల నుండి కెమికల్స్ ఉపయోగించకుండా శుద్ధి చేసి తయారు చేసేదాన్ని కోకోనట్ షుగర్ అంటారు. ఇది తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో పొటాషియం, ఐరన్, కాల్షియంజింక్, ఉంటాయి. షుగర్ గ్లైసమిక్ ఇండెక్స్ 68 తో పోలిస్తే కోకోనట్ షుగర్ GI-35 మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని పాలు, పెరుగు, కేక్స్, బ్రేక్ ఫాస్ట్ వంటలలో సందేహం లేకుండా వాడుకోవచ్చు. .
ఖర్జుర పంచదార : ఖర్జురాలతో తయారు చేసే దాన్ని డేట్స్ షుగర్ అంటారు. ఖర్జురాలు సహజంగానే తియ్యగా ఉంటాయి. పంచదార కు బదులుగా దీన్ని వాడుకోవచ్చు. దీనిని ఎవరైనా ఇంట్లో కూడా తేలికగా తయారు చేసుకోవచ్చు. దాని కోసం ఖర్జురాలను బాగా ఎండబెట్టి పొడి చేసుకుని జల్లించుకుంటే డేట్స్ షుగర్ రెడీ అవుతుంది. ఇందులో ఎక్కువగా ఫైబర్, మినరల్స్,విటమిన్స్ ఉంటాయి. డేట్స్ షుగర్ వాడడం వలన వల్ల కొలెస్ట్రాల్ తగ్గటమేకాక, బోన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. దీని GI విషయానికి వస్తే 45 నుండి 50 వరకు ఉంటుంది.
పంచదార కు ఉన్న మరో పేరు వైట్ పాయిజన్ అని పిలుస్తారు. చెరుకు రసం తెల్లటి పంచదారగా రావాలి అంటే ఎన్నో రసాయనిక మార్పులు జరగాల్సి ఉంటుంది. అన్ని రకాల రసాయనిక విషపదార్థాలు కలిపినా తరువాత గాని మనకంటికి, తెల్లగా, కళ్ళకి యింపుగా కనబడే పంచదార తయారవదు. కాబట్టి పంచదార విషయం లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.