యాపిల్ కొబ్బరి హల్వా ఎప్పుడైనా టేస్ట్ చేశారా..!?

Share

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళనవసరం లేదు అనేది నానుడి.. ఆపిల్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. రోజు ఆపిల్ పండుని తింటే అనారోగ్య సమస్యల దరిచేరవు.. కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది.. అటువంటి కొబ్బరి ఆపిల్ రెండింటిని కలిపి పిల్లలకు తినిపిస్తే ఎంతో మేలు.. పైగా ఈ రెండింటిలో బోలెడన్ని పోషకాలు లభిస్తాయి.. కొబ్బరి ఆపిల్ హల్వా ఎప్పుడైనా తిన్నారా.. తింటే ఎంత బాగుంటుందో తెలుసా.. ఈ హల్వా తయారు చేసి పిల్లలకు చేసి పెడితే ఎంతో ఇష్టంగా లాగించేస్తారు.. కొబ్బరి యాపిల్ హల్వా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Apple Coconut Halwa Recipe Preparation

కొబ్బరి ఆపిల్ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు :

ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఆపిల్ ఒకటి, డ్రై ఫ్రూట్స్ గుప్పెడు, చిక్కని పాలు ఒక కప్పు, చెక్కెర పావు కప్పు, నెయ్యి రెండు చెంచాలు.

ముందుగా ఆపిల్ తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. లేదంటే ఆపిల్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి గుజ్జులా తయారు చేసుకోవాలి.. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో పాలు పోసి బాగా మరిగించాలి. ఇందులో పంచదార, యాపిల్ గుజ్జు వేసి కలిపి పది నిమిషాల పాటు ఉడికించాలి.. ఈ మిశ్రమం దగ్గర పడేలోపు..

Apple Coconut Halwa Recipe Preparation

ఒక పాన్ తీసుకొని రెండు నిమిషాలు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించుకోవాలి.. ఇప్పుడు ఆపిల్ మిశ్రమం దగ్గర పడ్డాక అందులో కొబ్బరి తురుము యాలకుల పొడి వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరిగా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి వేసి కలపాలి అంతే టేస్టీ టేస్టీ ఆపిల్ కొబ్బరి హల్వా రెడీ. మీకు పంచదార వద్దనుకుంటే చివరిలో ఐదు నిమిషాలు తేనెను కలుపుకోండి..


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

28 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

31 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago