are drinking highly soda? follow this steps
ఈ మధ్యకాలంలో సోడా తాగడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. అలా బయటకు వెళ్లి రెస్టారెంట్ కి వెళ్తే చాలు మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ తో పాటు సోడాను కూడా ఆర్డర్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ సోడాను చిన్నపిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు. అయితే ప్రతిసారి ఎక్కువ మోతాదులో ఈ సోడా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.సోడాను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా మనం రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు సోడా ను కూడా ఆర్డర్ చేస్తూ తాగడం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈ సోడాలో ఎక్కువ మోతాదులో చక్కెర స్థాయిలు ఉంటాయి.అందువల్ల ఒక గ్లాసు పరిమితికి మించి సోడా ఎక్కువగా తాగేవారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, అంతేకాకుండా ఇంతకుమునుపే ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఒక గ్లాసుకు మించి సోడా తాగే వాళ్లకు “రిస్క్ ఆఫ్ డెత్” ఎక్కువని జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
అంతేకాకుండా ఈ అధ్యయనంలో షుగరీ సోడా కంటే డైట్ సోడాలు మూడు రెట్లు ప్రమాదమని నిపుణులు తెలియజేశారు. అందుకోసమే అత్యంత ప్రమాదకారిగా ఉన్న ఈ సాఫ్ట్ డ్రింక్స్ కి బదులుగా చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యం పెరగడంతోపాటు, రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. అంతే కాకుండా ఆహారంలో వాడే రంగుల వల్ల కూడా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని చెప్పవచ్చు. ఈ ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడటం వల్ల వీటి ప్రభావం డిఎన్ఏ పై చూపి క్యాన్సర్ కి దారి తీస్తాయని కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది. కొంతమంది ప్లాస్టిక్ బాటిల్స్ లో దొరికే సోడా తాగడం వల్ల ప్రమాదకరమైన భావించి అల్యూమినియం టిన్ లో దొరికే సోడాలను తాగుతున్నారు. అయితే వీటిని అధికంగా తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేశారు.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…