Marriage Issue: పెళ్లికి ఫిట్
పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నాకూడా మనస్సులో ఒక మూల ఏదో భయం పీడిస్తుంటుంది. పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో? ఎన్నికష్టాలు పడవలిసి వస్తుందో ? అసలు నేను పెళ్లికి ఫిట్ అవుతానా ? సంసార సాగరాన్ని ఈదగలుగుతానా ? ఇలా చాలా అనుమానాలు పెళ్లి వయసు లో ఉన్న యువత కి కలుగుతున్నాయి. అందుకే మన చుట్టూ పెళ్లికాని వారే ఎక్కువగా కనబడుతున్నారు. ఇలా పెళ్లంటే భయపడడాన్ని ‘గామోఫోబియా’ ( Gamo Phobia ) అని పిలుస్తారు. ఇది ఉన్నవారు పెళ్లి గురించి ఒకరికి కమిటిమెంట్ ఇచ్చేందుకు చాలా భయపడుతుంటారు.
Marriage Issue: కారణం….
ఈ ఫీలింగ్ వారసత్వంగా వచ్చేది కాదు. ఇంట్లో లేదా చుట్టుపక్కల కుటుంబాలలో ఉండే భార్యాభర్తల (Couples ) గొడవలు కావచ్చు లేదా , కుటుంబాన్ని పోషించలేక ఆ ఇంటి పెద్ద పడే కష్టాలు చూసి కావచ్చు . చిన్నప్పట్నించిరోజు గొడవలు పడే కుటుంబంలో పెరిగిన బిడ్డ పెరిగి పెద్దయ్యాక ఈ ఫోబియా బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. ఈ భయాన్ని ఒక మానసిక సమస్యగా భావించవచ్చు. ఈ ఫోబియా ఉన్న వారికీ ఒకరితో అనుబంధం ఏర్పరచుకోవడం కన్నా , ఒంటరిగా బతకడమే మంచిదనిపిస్తుంది. అందుకే పెళ్లి అంటే చాలు ఎక్కడ లేని భయం పుట్టుకు వచ్చి పెళ్లి వాయిదా వేస్తూ వస్తుంటారు. కానీ తమకున్న భయాలను మాత్రం బయట పెట్టరు.
గామో ఫోబియా నుంచి
కాస్త ప్రయత్నిస్తే గామో ఫోబియా ( Gamo Phobia ) నుంచి చాలా తేలికగా బయటపడచ్చు. దీనికోసం వైద్యుల వద్దకు కౌన్సిలింగ్ కు వెళితే చాలా మంచిది. అలాగే పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను మాత్రం తెలుసుకుంటుండాలి.
పెళ్లిని భయం గా భారంగా కాకుండా ప్రకృతిలో, సృష్టిలో ఒక భాగంగా భావించండి.
పెళ్లి తరువాత అన్ని మారిపోతాయి అని మీకు మీరే అనేసుకోకండి. , భాగస్వామిని కలుపుకుపోతూ మీకు నచ్చినట్టుగా మీరు జీవించే విధం గా ప్లాన్ చేసుకోండి.వివాహానికి దూరం గా ఉండి , మీ వారసులను చూసుకునే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న జంటల తో రోజూ కొంతసేపు గడుపుతూ ఉండండి.ఇది మీలో భయాన్ని దూరం చేస్తుంది. ఈ గామో ఫోబియాను తరిమికొట్టే థెరపీలు కూడా ఉన్నాయి. ఆ థెరపీలు తీసుకుంటే సంసారసాగరాన్ని ఈదగలను అనే ధైర్యం పెరుగుతుంది.