cooking items:అల్యూమినియం, స్టీల్ పాత్ర లతో పోలిస్తే కార్బన్ స్టీల్ వేడిని ఎక్కువ నిలిపి ఉంచుకుంటుంది. అందుకే దీన్ని క్యాంప్ ఫైర్ ఇండక్షన్, గ్రిల్స్, వంటకాల కోసం కూడా బాగా వాడుకోవచ్చు. మన్నిక విషయంలో కూడా ఇతర లోహం కంటే ఇది మెరుగైనది అని చెప్పక తప్పదు .కార్బన్ స్టీల్ వంట పాత్రల లో ఉండే లోపలి భాగం నాన్ స్టిక్ ప్యానెల్‌తో ఉంటుంది.
ఎలాంటి రిస్క్ లేకుండా సులభంగా వీటిలో వంటలు చేసుకోవచ్చు. ఈ లేయర్ వలన వంట పాత్రలకు తుప్పు పట్టదు. మనకు అందుబాటులో ఉండే నాన్ స్టిక్ పాత్రలు జాగ్రత్తగా వాడకపోతే గీతలు పడి నాన్ స్టిక్ లేయర్ ఊడి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలాంటి పాత్రలో వండుకోవటం కష్టంగా అనిపిస్తుంది. అయితే కార్బన్ స్టీల్‌తో ఇలాంటి సమస్యలు రావు. వీటిపై గీతలు పడకుండా ప్రత్యకమైన విధానం లో తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ పాత్రలకు ఉండే నాన్ స్టిక్ లేయర్ పోయే అవకాశం ఉండదు. స్టెయిన్ లెస్ స్టీల్, కాస్ట్ ఐరన్, ఎక్కువ బరువు ఉంటాయి. కానీ కార్బన్ స్టీల్ తేలికగా, దృఢంగా ఉంటాయి. ఇవి కాస్ట్ ఐరన్‌తో పోలిస్తే సగం బరువు మాత్రమేఉండటం వీటి ప్రత్యేకత.
స్టెయిన్ లెస్ స్టీల్ ధరతో పోల్చి చుస్తే, కార్బన్ స్టీల్ ధర చాలా తక్కువ అనే చెప్పాలి . అంతే కాదు వీటి తో ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల, వీటిని వినియోగించుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అన్ని విధాలా ఇది బెస్ట్ అనిపించుకుంటుంది.