Exercise: మీకు వ్యాయామం చేయడానికి సమయం  లేదని బెంగ పడుతున్నారా ? ఇలా చేయండి మీ   బెంగ  తీరుతుంది!!

Share

Exercise: చాలా మంది కి వ్యాయామం చెయ్యాలి  అని ఉంటుంది.  కానీ   ఒక గంట   జిమ్ కి వెళ్లడానికి  కానీ, ఇంట్లో    వ్యాయామం చేయడానికి గాని ,వాకింగ్ కి గాని అస్సలు కుదరని పరిస్థితిలో ఉంటారు.   మీకు సమయం లేకపోయిన వ్యాయామం  చేయవచ్చు అది ఎలా అనేది చూద్దాం.ఎస్కలేటర్ లేదా లిఫ్ట్ కి బదులు మెట్లు వాడుకోండి.   శరీరానికి చక్కని  వ్యాయామం జరుగుతుంది. మెట్లు దిగడం తేలికే  కానీ మెట్లు ఎక్కడం కొంచెం కష్టం గా అనిపిస్తుంది.కాబట్టి  మొదటి రోజు కొన్ని మెట్లు  ఆ తర్వాత మరికొన్ని    అలా టార్గెట్ గా  మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తే అతి త్వరలో  చాలా తేలికగా  ఎన్ని మెట్లయినా ఎక్కేస్తారు.

 

మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ఎక్కువ మెట్లు  ఎక్కడానికి ప్రయత్నించకండి. మన శరీరం మరియు ఊపిరితిత్తుల కు  ఆ శ్రమకు  కాస్త అలవాటు పడాలి.  ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమిటంటే అవి చాలా త్వరగా అలవాటు  పడతాయి కూడా. అలా కాకుండా మీ సామర్థ్యానికి మించి  ఎక్కితే త్వరగా అలసిపోయి మెట్లు  ఎక్కడం మానేద్దాం అని అనిపిస్తుంది.  కుర్చీలో కూర్చుని ఒక గంట దాటితే లేచి   5 నిమిషాలపాటు  అలా  నడిచి రండి . మీ  వర్క్ రోజుకు  9 గంటలు అయితే గంటకు 5 నిమిషాల చొప్పున రోజుకు 45 నిమిషాలు  నడిచినట్టు అయిపోతుంది.  ఇది  మంచి వ్యాయామం కూడా.  ఇలా వాకింగ్ బ్రేక్ తీసుకోవడం వలన   వ్యాయామం  తో పాటు  మీ పని చేసే  సామర్థ్యాన్ని కూడా పెరిగేలా చేస్తుంది.

 

మైండ్ చాలా బాగా పని చేస్తుంది.కాబట్టి  ప్రతి గంట గుర్తు పెట్టుకుని    నడిచి రండి.
ఉదయం లేవగానే  స్ట్రెట్చ్   చెయ్యండి. ఇది  చేయడం చాలా తేలిక .ఇలా చెయ్యడం తో ఆ రోజుకు కావలసిన శక్తి  పుష్కలంగా మీకు  అందుతుంది.    మంచి ఉత్సాహం గా  రోజుని ప్రారంభించవచ్చు. ఒక ఐదు నిమిషాల పాటు     మీరు మంచం మీద  చేసేయవచ్చు.  వీపు, కాళ్ళు, చేతులు, మెడ మెల్లగా  తిప్పుతూ సాగదీయడం వలన    మీకు బద్ధకం అంత వదిలి  యాక్టివ్ గా అవుతారు.


Share

Related posts

Relationship tips శృంగార ఆస్వాదనలో ముఖ్యమైనది ఇదే!!

Kumar

Teenage: టీనేజ్ లోకి అడుగుపెడుతున్న పిల్లలలో వచ్చే శారీరక, మానసిక మార్పులు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన విషయాలు!!

Kumar

పియానో నేర్చుకోవడం వలన పిల్లలకు ఇన్ని లాభాలు ఉంటాయి.

Kumar