NewsOrbit
హెల్త్

Children height: మీ పిల్లలు వయస్సుకు తగ్గట్టుగా ఎత్తు పెరగడం లేదని బాధ పడుతున్నారా ?? అయితే ఇది చక్కని పరిష్కారం !!

Children height: పిల్లల చక్కని ఎదుగుదలకు  :
ఎదిగే పిల్లల కు ఇచ్చే ఆహారం విషయంలో తల్లిదండ్రులు చాలా  జాగ్రత్తగా  ఉండాలి. లేదంటే  వారి మానసిక ,శారీరక ఎదుగుదల దెబ్బతినే అవకాశం ఉంటుంది. వారు ఇష్టపడుతున్నారు కదా అని చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్,కూల్ డ్రింక్స్  అస్సలు ఇవ్వకూడదు. పిల్లల చక్కని ఎదుగుదలకు  మంచి పోషకాహారం అందేలా చేయాలి.  అప్పుడే వారు  అన్నివిధాలా ఆరోగ్యం గా ఉంటారు.

Children height: జీర్ణవ్యవస్థ పనితీరు:

ఇక ఎత్తు పెరగని పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారు తీసుకునే  ఆహారంలో కొన్ని పదార్థాలను  చేర్చడం వలన ఈ సమస్యను అధిగమించ కలుగుతారు.ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.   ఎదుగుతున్న పిల్లలకు చిలగడదుంప  మంచి సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. ఇది   కడుపు పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్యను  పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఎ ఎముకల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. పిల్లల ఎత్తు పెరిగేలా  పెంచడంలో ఇది  ముఖ్య పాత్ర పోషిస్తుంది.   చిలగడదుంపలో ఉండే  ఫైబర్లు  జీర్ణవ్యవస్థ పనితీరును పెంచుతాయి.

అలాగే  బ్లూ బెర్రీ, స్ట్రాబెరీ, మల్బరీ వంటి పండ్లల్లో  కూడా అనేక విటమిన్లు, ఖనిజాలు, ఇతర ఫైటోన్యూట్రియెంట్లు సంవృద్ధిగా  ఉంటాయి. ఇవి పిల్లల ఎత్తును  పెంచడానికి బాగా ఉపయోగపడతాయి.    బెర్రీల్లో ఉండే  సి విటమిన్   శరీరంలో కొల్లాజెన్‌  ఉత్పత్తి కి కారణం అవుతుంది. కాబట్టి ఇది కూడా పిల్లల ఎత్తును పెంచడంలోఅద్భుతం గా పనిచేస్తుంది. శరీర కణాల నిర్మాణం, వాటి మరమ్మత్తుకు కూడా ఇవి చాలా  బాగా పనిచేస్తాయి. కాబట్టి పెరిగే పిల్లల ఆహారంలో కచ్చితం గా  బెర్రీలు ఉండేలా జాగ్రత్త పడాలి. గుడ్డు తినడం , పాలు తాగడం  కూడా ఎదిగే పిల్లల ఆరోగ్యానికి చాలా  మంచివి. వీటిలో  ప్రొటీన్లతో పాటు క్యాల్షియం, మినరల్స్ ఎక్కువగా  లభిస్తాయి.

ఎదుగుతున్న  పిల్లలకు:

ఎదిగే పిల్లల ఎత్తు  పెంచడానికి  ఇవి  అద్భుతం గా పనిచేస్తాయి. అందుకే పిల్లల ఎత్తు పెరగాలంటే ప్రతి రోజూ గుడ్లు  తినిపించాలి. పిల్లలు ఎత్తు  పెరగడం లో  ఆకు కూరలు కూడా  ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆకు కూరలలో  ఉండే విటమిన్లు, మినరల్స్ మన ఎముకల సాంద్రతను పెంచి దృఢంగా ఉండేలా  చేస్తాయి. కాబట్టి  పచ్చని ఆకు కూరలు ఎదుగుతున్న  పిల్లలకు చాలా అవసరం.  కాబట్టి పిల్లలు వయస్సుకు తగ్గ ఎత్తు లేరు అని అనిపించినప్పుడు ఆహారం విషయం లో ఈ జాగ్రత్తలు పాటించండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri