Children : పరీక్షకు వెళ్ళేటప్పుడు ఆహారం:
ఎగ్జామ్ వెళ్లే ముందు రోజే పరీక్ష కేంద్రాలను ఎక్కడ ఉన్నాయి? మీకు ఆ ప్లేస్ ఎంతదూరం మీరు ఏ టైం కి బయలుదేరాలి అనేవి కచ్చితం గా వాకాబు చేసుకుని ఒక గంట ముందే అక్కడ ఉండేవిధం గా చూసుకోవాలి. పరీక్ష రోజు ఎంత లేదన్నా కాస్త ఒత్తిడి ఉంటుంది కనుక ఆహారం తినకుండా వెళ్తే ఇంకా సమస్య పెరగవచ్చు. కాబట్టి పరీక్షకు వెళ్ళేటప్పుడు ఆహారం అశ్రద్ధ చేయవద్దు.
Children : ముందు రోజే సిద్ధం:
పరీక్ష రోజు సింపుల్ గా రెడీ అవ్వండి. ఆభరణాలు విచిత్రమైన చేతి గడియారాలు వేసుకోకండి. సాధారణ డ్రెస్‌లే వేసుకోవాలి. ఎక్కువ పాకెట్లు ఉన్న డ్రెస్‌లు అస్సలు వేసుకోకూడదు. ఈ మధ్య అన్ని పరీక్షలకు డ్రెస్ కోడ్ పెడుతున్నారు కాబట్టి ముందుగానే మీరు రాస్తున్న పరీక్షకు సంబంధించిన డ్రెస్ కోడ్ తెలుసుకుని ఆవిధం గా వేసుకోవడం మంచిది. మీరు వేసుకోవాలన్న ప్రతి డ్రెస్ ముందు రోజే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ముందు ఒకసారి పూర్తిగా చదివి అర్ధం చేసుకుని… మీ ఆన్సర్ షీట్ మీద మీ నెంబర్ వేసి మీకు బాగా వచ్చిన వాటిని ముందుగా రాయండి. తర్వాత మిగిలిన వాటి గురించి రాయండి.
అయిపోయిన ఎగ్జామ్ గురించి :
అన్ని వచ్చినవే అయినా కూడా ఒక్కో సారి అన్నింటికీ సమాధానం రాసే సమయం ఉండక పోవచ్చు. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు టైం మేనేజిమెంట్ కచ్చితం గా పాటించాలి. లేకుంటే తెలిసిన జవాబులు కూడా వదిలేయాల్సి వస్తుంది.ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అయిపోయిన ఎగ్జామ్ గురించి ఇక ఆలోచించకుండా తర్వాతి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం అనేది మంచి పద్దతి.