హెల్త్

ఫ్రిడ్జ్ లో అసలు పెట్టకూడని ఆహార పదార్ధాలు ఏవంటే..?

Share

కాలంతో పాటు మనుషులు ఎలా అయితే మారతారో టెక్నాలజీ కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది.ఒక‌ప్పుడు మనం ఏమి తినాలన్నా అప్పటికప్పుడు తాజాగా ఉన్న కూర‌గాయ‌ల‌ను తెచ్చుకుని వండుకుని తినేవాళ్ళం.. అలాగే మాంసం, గుడ్లు,పండ్లు ఇలా ఏదయినా సరే అప్పటికప్పుడు వండుకునే వాళ్ళం. ఎందుకంటే అప్పట్లో ఆహార పదార్ధాలను నిల్వ చేయడానికి ఫ్రిడ్జ్ లు అవి లేవు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఫ్రిడ్జ్ ఒక సాధారణ వస్తువు అయిపోయింది. ప్రతిదీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. వండిన‌వి కూడా పాడ‌వ‌కుండా ఫ్రిడ్జ్ లో పెట్టి వారం రోజుల పాటూ తింటున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టిన కొన్ని ఆహార‌ప‌దార్థాలు తిన‌డం వ‌ల్ల చాలా రకాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

పాలు, పెరుగు:

మరి ఆ ఆహార‌ప‌దార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రిడ్జ్ లో ఎక్కువ మంది పాల‌ను పెడుతూ ఉంటారు. అయితే పాల‌ను ఫ్రిడ్జ్ లో పెట్టి తాగ‌టం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగే పెరుగును కూడా చాలా మంది ఫ్రిడ్జ్ లో పెడతారు. నిజానికి పెరుగును కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అలా పెట్టడం వలన అనారోగ్య స‌మ‌స్య‌లు తప్ప‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. పాలు,పెరుగులో లాక్టోస్ బాసిల్ల‌స్ అనే బాక్టీరియా ఉంటుంది. వాటిని ఫ్రిడ్జ్ లో పెట్ట‌డం వ‌ల్ల అది చెడు బ్యాక్టిరియాగా మారే అవ‌కాశం ఉంది. ఫలితంగా ఆ పాలు, పెరుగు తినడం వలన ఎసిడిటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.

కూరగాయలు, గుడ్లు,పండ్లు :

గుడ్ల‌ను కూడా ఫ్రిడ్జ్ లో పెట్ట‌డం అరోగ్యానికి మంచిది కాద‌ట‌.కూర‌గాయ‌లు ఫ్రిడ్జ్ లో పెడితే తాజాగా ఉంటాయ‌ని అనుకుంటారు. కానీ కూర‌గాల‌య‌ల్లో ఉండే పోషకాలు కూడా న‌శించి పోతాయి. అలాగే కాయగూరలు, పండ్లు కూడా ఫ్రిడ్జ్ లో పెట్ట‌కూడ‌ద‌ట‌.అలాగే చాలామంది మాంసాన్ని కూడా కొన్ని రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తింటారు. నిజానికి నాన్ వెజ్ ను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి తినకూడదు. అలాగే వండిన కూరలను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి తినకూడదు.అలా ఆ వంటకాల‌ను తింటే ఫుడ్ పాయిజ‌న్ అయ్యే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ట‌.


Share

Related posts

Groundnuts: వేరుశెనగ పప్పు ను పొట్టు తీసి తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!!

Kumar

ఈ వయసులో వచ్చే సమస్యలను తరిమికొట్టే కాయ ఇదే!

Teja

ఓన్లీ ఫర్ లేడీస్ : బరువు తగ్గాలి అంటే తేలిక మార్గం !

Kumar