హెల్త్

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాల జోలికి అసలు పోకండి..!

Share

మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే కిడ్నీలు మానవుని శరీరంలో ఒక ఫిల్టర్ లాంటివి .శరీరం నుంచి విష పదార్ధాల్ని మూత్రం ద్వారా బయటకు విసర్జిస్తూ ఉంటాయి.ఈ కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో విషపదార్ధాలు పేరుకుని పోతాయి. అందుకే కిడ్నీలను ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా చూసుకోవాలి. తినే తిండి విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది. మరి ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా

ప్రాసెస్ చేసిన ఆహారపదార్ధాలు :

మైక్రోవేవ్‌లో వండిన ఆహారాలు లేదా ప్రాసెస్ చేసిన ఆహారలకు దూరంగా ఉండాలి.ప్రాసెసింగ్ అంటే ఆహారం కొవ్వు, చక్కెర లేదా సోడియంతో నిండి ఉండవచ్చు కాబట్టి వాటికీ దూరంగానే ఉండాలి.

సోడాలు :

సోడాలో చక్కెర ఎక్కువగాను పోషక విలువలు తక్కువగాను ఉంటాయి.ఇవి మీ ఆహారంలో అదనపు కేలరీలను జోడిస్తాయి. దీని ఫలితంగా బరువు పెరుగుతారు. సోడా వలన ఎముకల వీక్ అవుతాయి. ఫలితంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది.

ప్రాసెస్ చేసిన మాంసం..

ప్రాసెస్ చేసిన మాంసాలు తింటే మీ కిడ్నీలు త్వరగా చెడిపోతాయి. ఇవి అధిక సోడియం కలిగిన ఆహారాలు. క్రమం తప్పకుండా అదనపు సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది ఫలితంగా మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుంది.

డీ ఫ్రై చేసిన పొటాటోస్:

ఫ్రెంచ్ ఫ్రైస్, డీప్ ఫ్రై పొటాటో చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని తీసుకుంటే మీ కిడ్నీలు పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుండె, కిడ్నీ వంటి వ్యాధుల నుంచి రక్షించబడాలంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బంగాళాదుంపలలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ డైట్ లో బంగాళాదుంపలకు తక్కువ ఛాన్స్ ఇవ్వండి

 


Share

Related posts

Fruit Juices: ఈ జ్యూస్ లు తాగితే వారం రోజుల్లో చాలా కేజీలు తగ్గచ్చు , చేసుకోవడం కూడా తేలిక

bharani jella

Jamun Leaves: నేరేడు ఆకులతో మీరు ఊహించని ప్రయోజనాలు ఇవే..!!

bharani jella

కొత్తగా లైఫ్ లో శృంగారం చేస్తున్నారా  ? ఈ  పాయింట్ లూ కంపల్సరీ మీకు !

Kumar