న్యూస్ హెల్త్

జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాయండి చాలు..!

Share

ప్రస్తుతం అందరిని వేధిస్తున్న సమస్యలలో జుట్టు రాలడం కూడా ఒకటి. వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఆందోళన జుట్టు రాలడానికి కారణాలు.. ఈ సమస్యలు ఏవైనా జుట్టు రాలడం మాత్రం తగ్గట్లేదు.. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కంటే వీటిని కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకుంటే.. జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది..

ముందుగా ఒక పాత్ర తీసుకుని పొయ్యి మీద పెట్టి రెండు కప్పుల కొబ్బరి నూనె పోయాలి.. నూనె వేడెక్కేలోపు కలబంద సన్నని లేత మట్టలను తీసుకోవాలి. వాటిని మధ్యకు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే రెండు రెబ్బలు వేపాకు తీసుకొని మధ్యకు కట్ చేసి పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయలపై ఉన్న పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనె వేడెక్కాక కలబంద ముక్కలు, వేపాకులు, ఉల్లిపాయ పొట్టు అన్నింటినీ వేసి ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించుకోవాలి.. నూనె బాగా మరిగిన తర్వాత ఒక గాజు సీసాలోకి వడపోసుకోవాలి. ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది..

ఇలా సిద్ధం చేసుకున్న కొబ్బరి నూనెను జుట్టు కుదుళ్ల నుంచి రాసుకొని మసాజ్ చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనె రాసుకొని ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సమయం ఉన్నవారు రోజంతా ఈ నూనె రాసుకుని ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు చివర్లు చిట్లిపోతే వాటిని రిపేర్ చేసి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది..


Share

Related posts

ఒంగోలులో టిడిపి, వైసిపి నేతల ఘర్షణ

somaraju sharma

ఎమ్మెల్సీ సునీతను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసిన టిడిపి! అది ఎలాగంటే ?

Yandamuri

Naga Chaitanya: ఈ ఏడాదిలో రిలీజ్ కానున్న 3 సినిమాలతో చైతు హ్యాట్రిక్ అందుకుంటాడా..!?

bharani jella