Diabetes : బేకింగ్ సోడాను మనం రోజు వాడుతునే ఉంటాం. దాంతో శ్వాసలో తాజదనం వస్తుంది. అలాగే మన దంతాలు తెల్లగా మారుతాయి. అయితే మనం వాడే బేకింగ్ సోడాకు డయాబెటీస్ కు మధ్య సంబంధం ఉంటుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. అది ఎలాగంటే డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆ వ్యాధిని సరైన సమయంలో గుర్తించకపోతే అది డయాబెటిక్ కెటోయాసిడోసిస్గా మారే అవకాశం ఉంది. ఇలా జరిగితే అది మన ఆరోగ్యానికి ఎంతో ప్రామాధకరం.ఈ బేకింగ్ సోడా రక్తంలోని పీహెచ్ స్థాయిని ఎక్కువగా పెంచుతుందట. అట్లాగే మ్యూకోర్ మైకోసిస్, డీకేఏ చికిత్సలో బేకింగ్ సోడా వాడకం గురించి కూడా పలు పరిశోధనలు జరుగుతున్నాయి.
మరికొన్ని రీసెర్చ్ లో ముకోర్ మైకోసిస్ సంక్రమణను డీకేఏ ను వేగవంతం చేయగలుగుతుందని సైంటిస్టులు కనుగొన్నారు. దీనికి కారణం దీంట్లోని ఐరన్ చెలేషన్, సోడియం బైకార్బోనేట్ వాడకం నివారణ చర్యలను అందిస్తుందని తెలిపారు. అయితే డయాబెటిస్ చికిత్సలో బేకింగ్ సోడా ప్రభావాలపై ఇప్పటికైతే జంతువుల మీదే పరిశీలించారు. ఈ పరిశోధన ఇంకా మనుషుల మీద జరగలేదు.
కానీ ఈ జంతువులపై చేసిన రీసెర్చ్ లో పలు విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో బేకింగ్ సోడా వాడకం వలన ముకోర్ మైకోసిస్ను నివారించగలదని చూపిస్తుంది. బేకింగ్ సోడా వాడకం వలన మ్యూకోర్ మైకోసిస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని తెలుస్తుంది. డీకేఏ ఉన్న రోగులు వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచితే.. ఇది కణాలకు నష్టం కలిగిస్తుదని తేలింది. ఇందులోని సోడియం బైకార్బోనేట్ ఫంగస్ పెరుగుదలను ఆపుతుంది. దీంతో సంక్రమణను నివారించడంలో సాయం చేస్తుందని తేలింది.