‘ ఆ ‘ ప్లేస్ లో దురద రాకూడదు .. వస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరకి పరిగెత్తల్సిందే !

' ఆ ' ప్లేస్ లో దురద రాకూడదు .. వస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరకి పరిగెత్తల్సిందే !
Share

మధుమేహాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు.  నరాలను దెబ్బతీస్తుంది. చివరికి పాదాలకు సైతం సోకి, నడవకుండా మూలన పడేస్తుంది..పురుషాంగం దురద పెడుతున్నట్లయితే, మధుమేహం వల్ల ఏర్పడే అరుదైన సమస్య ఇది. కొంతమందిలో మధుమేహం లక్షణాలు వెంటనే కనిపించవు. అయితే, పురుషాంగం దురద పెట్టడం, శిశ్నాగ్ర చర్మంపై దద్దర్లు వస్తాయి. వీటి వల్ల మూత్రం పోసినప్పుడు, సాధారణ సమయాల్లో కూడా అంగం చురుక్కుమంటూ మండుతుంది.

' ఆ ' ప్లేస్ లో దురద రాకూడదు .. వస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరకి పరిగెత్తల్సిందే !
ఈ సమస్యను మీరు తేలిగ్గా తీసుకోవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్య పరిభాషలో ఈ సమస్యను బలానిటీస్ (Balanitis) అని అంటారు. బలానిటీస్‌కు డయబెటీస్‌కు సంబంధం ఏమిటీ?: ‌మధుమేహం ఏర్పడినా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపుతప్పినా.. ఈ సమస్య ఏర్పడుతుంది. మధుమేహం అదుపులో లేనట్లయితే అంగంలోని శిశ్నాగ్ర చర్మం మీద చిన్న చిన్న పొక్కులు వస్తాయి. వీటినే బెలానిటీస్ ఇన్ఫెక్షన్ అంటారు. అలాగే, మధుమేహం ట్రీట్మెంట్ కోసం వాడే ఔషదాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే.. కొన్ని ఔషదాలు శరీరంలో ఉండే చక్కెరలను మూత్రం ద్వారా బయటకు గెంటేస్తాయి. ఫలితంగా శీశ్రాగ్రంలో నిలిచిపోయే చక్కెర్లు ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. చక్కెర్లు పురుషాంగ చర్మంలో ‘ఈస్ట్’ అనే ఫంగస్‌ను ఏర్పరుస్తాయి. మధుమేహం రోగులు ఎక్కువగా మూత్రం పోస్తుండటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. డయబెటీస్ లేనివారిలో కూడా బలానిటీస్ సమస్య కనిపిస్తుంది.
మర్మాంగాలను శుభ్రంగా ఉంచుకోని వ్యక్తులకు కూడా ఇది సోకుతుంది. అలాగే, సబ్బుల్లో ఉండే గాఢత కూడా పురుషాంగాలపై దుష్ప్రభావాలను చూపుతాయి. ఈ సమస్య రాకూడదంటే.. మూత్రానికి వెళ్లిన తర్వాత మర్మాంగాలను శుభ్రం చేసుకోవాలి. ఈ సమస్య కేవలం పురుషుల్లో మాత్రమే కాదు.. మహిళల్లో కూడా ఏర్పడుతుంది. మధుమేహం సోకిన స్త్రీలలో కూడా బలానిటిస్ తరహాలోనే ఫంగస్ ఏర్పడి ఇన్ఫెక్షన్లు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Share

Related posts

Phobias : మీ భయలను బట్టి మీకు ఉన్న ఫోబియా ని తెలుసుకోండి!!

Kumar

Rice : ఏ రకపు బియ్యం అయినా క్యాన్సర్ కారకమే…. ఈ విధానం లో వండుకుంటే ప్రమాదం ఉండదు   !!  

siddhu

Lotta Peesu: నిత్యం మనం చూసే ఈ మొక్క వలన ఎన్ని ప్రయోజనాలు తెలుసా..!?

bharani jella