Beauty: క్యారెట్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే.. క్యారెట్ ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా.. ఇది చర్మకణాలను తాజాగా ఉంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.. క్యారెట్ అన్ని రకాల చర్మ సమస్యలు తొలగించి మెరిసే చర్మ సౌందర్యాన్ని కలగజేస్తుంది.. క్యారెట్ ను ఏ విధంగా ఉపయోగిస్తే ఎటువంటి బ్యూటీ బెనిఫిట్స్ కలుగుతాయో తెలుసుకుందాం..!
మొటిమలు మచ్చలతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు చెంచాల క్యారెట్ రసం, ఒక చెంచా తేనె , చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే ముఖం పై ఉన్న మొటిమలు, వాటి తాలూకు మచ్చలను పోగొట్టి ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. నిత్యయవ్వనంగా కనిపించాలి అనుకునేవారు చిన్న క్యారెట్ ముక్క, నానబెట్టుకున్న బాదం వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మీ ముఖం యవ్వనంగా కనబడుతుంది.
జిడ్డు చర్మం తో బాధపడుతున్నారు క్యారెట్, టమోటా, క్యాబేజీ మూడింటిని సమపాళ్లలో తీసుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి రాసుకొని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. జిడ్డు చర్మం పోయి అందంగా కనిపిస్తారు. సన్ టాన్ తొలగిపోవడానికి క్యారెట్ రసం అప్లై చేయాలి. ముఖంపై ఉన్న మృతకణాలు మొత్తం తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.