Vitamin E: విటమిన్ ఇ ఆయిల్ మనం ఉపయోగించే అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో వాడతారు.. మన చర్మానికి అవసరమైన విటమిన్స్ లో విటమిన్ ఇ కూడా ఒకటి.. ఇది ఇది చర్మం ముడతలు పడకుండా చేయడంలో, డార్క్ సర్కిల్స్ తొలగించడంలో, చర్మాన్ని కాంతివంతంగా మెరిపించడంలో సహాయపడుతుంది విటమిన్ ఈ ఆయిల్ ను ఏ విధంగా వాడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం..!
విటమిన్ ఇ ఆయిల్ నేరుగా ముఖానికి రాసుకుని అయిదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తర్వాత కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయటం వలన డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. టాన్ సమస్య ఉండదు. వృద్ధాప్య ఛాయలు కూడా తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. 3 విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సిల్స్, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజు రాసుకుంటూ ఉంటే డ్రై స్కిన్ సమస్య తగ్గుతుంది. ముఖాన్ని మృదువుగా చేసి మెరిసిపోయేలా చేస్తుంది.
ఒక చెంచా చందనం పొడి లో 2 విటమిన్ ఇ ఆయిల్ క్యాప్సిల్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు రాసుకుని ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే ముఖం పై ఉన్న నల్లటి మచ్చలను తొలగిస్తుంది. ముడతలు పడకుండా చేసి నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…