రోజూ ఉదయాన్నే టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ఆహార నిపుణులు తెలిపారు. దాల్చిన చెక్కలో శరీరానికి కావాల్సిన పీచు, కాల్షియం, ఐరన్ తదితర పోషకాలు ఉంటాయి.
అందుకే చాలా చాలా దేశాల్లో దీన్ని మిరాకిల్ ఫుడ్ అని అంటారు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల ఒంట్లో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటున్న వారికి, ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చక్కని ఉపశమనం కలుగుతుంది.
మధుమేహం రోగులకు అద్భుత ఔషధం, మెదడుకు రక్షణ కల్పిస్తుంది, జలుబు దగ్గులను సమర్ధవంతంగా తగ్గిస్తుంది, రక్తప్రసరణ మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తుంది, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది. మరియు గుండె జబ్బుల నుండి కాపాడుతుం, దీర్గాయువును ఇస్తుంది,నోటి దుర్వాసనకు, దంత సమస్యలను తగ్గించడానికి ఇది చక్కని చిట్కా.
అధిక రక్తపోటును అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డ కట్టడాన్ని అరికడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గించడంలోనూ దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది.
శరీరంలోని నిస్సత్తువను దూరం చేసి రోజంతా సరిపడే శక్తిని ఇస్తుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. దాల్చిన చెక్కనుఎలా తీసుకోవాలో చూద్దాం: దాల్చిన చెక్కను తేనెలో కలుపుకొని తినడం వల్ల ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె సంబంధ రోగాలను అరికడుతుంది. దాల్చిన చెక్క పొడి ఉదయాన్నే తాగే టీ లో దీన్ని కలుపుకొని తాగాలి. పళ్ల రసాల్లోనూ ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగవచ్చు.
ఈ సమస్యలు ఉంటే మాత్రం వద్దు: దాల్చిన చెక్క పొడిని అన్ని వయసుల వారు తినొచ్చు. అయితే, చర్మం మంటగా ఉన్నా, అలర్జీలు ఏర్పడినా.. తీసుకోవడం మానేయండి. గర్భిణీలు, ఆరేళ్ల లోపు పిల్లలు దాల్చిన చెక్కను ఆహారంతో తీసుకోకపోవడం మంచిది. పేగు సమస్యలు, కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారు దాల్చిన చెక్కను తీసుకోవద్దు.