కరివేపాకు గురించి ఇది  తెలుసుకోండి..  ఆ తర్వాత   కరివేపాకును తింటారో మానేస్తారో మీ ఇష్టం…

తాలింపుల్లో, కూరల్లో కరివేపాకు వేస్తేనేరుచి. రుచితో పాటు పోషకాలను అందించే కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి  అంటున్నారు ఆయుర్వేద నిపుణులు..  ప్రతిరోజు ఏడు నుంచి పది కరివేపాకులను తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు .

కరివేపాకు గురించి ఇది తెలుసుకోండి.. ఆ తర్వాత కరివేపాకును తింటారో మానేస్తారో మీ ఇష్టం...

కరివేపాకు తో జుట్టురాలడం, జుట్టు నెరవడం వంటి సమస్యలను తగ్గడం తో పాటు వెంట్రుకలు పెరిగేందుకు కూడా ఉపయోగ పడుతుంది . అధిక కొల‌స్ట్రాల్ త‌గ్గించ‌డంలో క‌రివేపాకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌తి రోజు క్రమం తప్పకుండ ఆహారంలో క‌రివేపాకు తీసుకోవ‌డం వలన బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు మంచి ఫలితాన్ని పొందుతారు .

కరివేపాకును ముద్దగా  నూరుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేయాలి. క్రమంగా ఇలా చేస్తూ ఉంటే  జుట్టు పెరుగుతుంది. కరివేపాకులో ఎ విటమిన్  ఉండడం వలన కంటిచూపును మెరుగు పరుస్తుంది. ఫలితంగాచూపు మందగించకుండా  రక్షిస్తుంది .

చాలామంది కి వంశానుసారంగా డయాబెటీస్ వస్తుంది. అలా తమ పూర్వీకుల నుంచి వస్తున్నమధుమేహం  రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం 10 కరివేపాకు ఆకులను కడిగి తినాలి. మొదట తినడానికి  కొంచెం కష్టం గాఉన్నాకూడా  నెమ్మదిగా అలవాటవుతుంది. ఇలా తినడం వల్ల డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా కరివేపాకును పొడి చేసుకుని అన్నంలో, టిఫిన్ లో వేసుకుని  తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో  లో ఉంటాయి.

కరివేపాకును ఆహారంతో కలిపి తినడం  వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు  ముఖంపై మచ్చలు మొటిమలు, ఏర్పడటం తగ్గుతుంది.
మలబద్ధకం  తేన్పులు, గ్యాస్, వంటి సమస్యలను కూడా కరివేపాకు నివారిస్తుంది.కాబట్టి చాల రకాల జబ్బులకు కరివేపాకు మంచి ఔషధం అని చెప్పాలి .