NewsOrbit
హెల్త్

Ghee: ఉదయం పూట నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Ghee: నెయ్యి పేరు వింటే చాలు ఎవరికయినా సరే ముందు గుర్తొచ్చేది రుచికరమైన స్వీట్లు. ఎంచక్కా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి కలుపుకుని తింటే ఆ రుచి వేరు కదా. కారపొడి దగ్గర నుంచి ఘుమఘుమలాడే బిర్యానీ వరకు అన్ని చాలా రకాల వంటకాల్లో నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటాము. కానీ చాలామంది నెయ్యి తింటే లావు అవుతారని తినడానికి భయపడతారు. నిజానికి అది అవాస్తవం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యికి బరువు పెరగడానికి ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా సరే పరిమిత పరిమాణంలో తింటే ఎటువంటి లోపాలు తలెత్తవు.

Ghee: చలికాలంలో నెయ్యి.. పొందండి వెయ్యి లాభాలు..!!

Ghee: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తింటే ఏమవుతుందంటే?

నెయ్యిని కూడా ఒక లిమిట్ లో తింటే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా. మరి ముఖ్యంగా ఒక చెంచా నెయ్యిని ఉదయాన్న పరగడుపున తింటే చాలా మంచిది. పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి. నెయ్యి ప్రేగులలోని ఆమ్ల pH స్థాయిని తగ్గించి చిన్న పేగును శుద్ధిచేస్తుంది. అలాగే పొద్దునే నెయ్యి తినడం వలన చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కలిగే సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి.

Ghee: పాలలో కలుపుకుని తాగితే మన శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..!?
జీర్ణ సంబంధ వ్యాధులను దూరం చేసే నెయ్యి :

మలబద్ధకం ఉన్నవారు తప్పనిసరిగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తింటే మలబద్ధకం తగ్గుతుంది. అప్పుడు పేగుల్లో కదలిక ఏర్పడి సుఖ విరేచనం అవుతుంది. ఇలా పొద్దున పూట నెయ్యి తింటే జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఫలితంగా ఎటువంటి ఉదర సమస్యలు కూడా మీ దరిచేరవు. ఒకవేళ మీకు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే పొద్దున్నే ఒక చెంచా నెయ్యిని మాత్రమే తినాలి. అలాగే ఉదయాన్నే నెయ్యి తింటే శరీరంలోని ఎముకలకు దృఢత్వం, శక్తీ, బలం పెరుగుతాయి.

Ghee tea: “ఘీ” టీ ఎప్పుడైనా ట్రై చేసారా?  
నెయ్యి వలన అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం:

నెయ్యి తింటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ముఖం మీద ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. అందుకే ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక చెంచా నెయ్యిని తినండి. అలాగే ఈ కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు కావున ఉదయాన్నే చెంచా నెయ్యి తినడం ద్వారా చాలా సమయం పాటు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది ఫలితంగా మీరు అతిగా తినకుండా ఉంటారు. తద్వారా బరువు పెరగకుండా స్లిమ్ గా ఉంటారు. ఉదయాన్నే నెయ్యి తింటే మంచిది అని ఎక్కువ తినకూడదు.. అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఏదైనా సరే లిమిట్ గా తింటేనే ఆరోగ్యానికి మంచిది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri