Sapota: సపోటా పండు గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. సపోటాను చికూ అని కూడా పిలుస్తారు. సపోటా పండు సీజనల్ పండ్లలో చాలా ముఖ్యమైన పండుగా అభివర్ణించవచ్చు. మామిడి, అరటి, జామ పండ్ల కన్నా సపోటా చాలా తియ్యగా, రుచికరంగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో పోషక విలువలు కూడా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ,సి,ఇనుము మొదలైన ఖనిజ లవణాలు సైతం సపోటా పండులో పుష్కలంగా లభిస్తాయి.మరి సపోటా పండులోని పోషకాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా.!
Health Care: పరగడుపున ఈ 3 తింటే ఆ సమస్యలు రావు..!!
Sapota: సపోటా పండు యొక్క ఉపయోగాలు:
సపోటా పండులో విటమిన్ A అధికంగా ఉంటుంది. అందుకే ఈ పండు తింటే కంటి చూపు మెరుగవుతుంది. అలాగే ఎమన్నా కంటి సమస్యలు ఉన్నాగాని నయం అవుతాయి. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు సపోటా పండు తింటే కొంతమేర పరిష్కారం ఉంటుంది.సపోటాలో ఉండే విటమిన్లు, పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ కు గురయ్యి త్వరగా అలిసిపోతుంది. అప్పుడు తక్షణ శక్తిని పొందటానికి సపోటా పండు తినాలి.సపోటా పండులో శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్ సమృద్ధిగా ఉంటుంది. సపోటా పండులో ఆంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఎమన్నా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాగాని సపోటా పండు తింటే తొలగిపోతాయి.
Sapota: సపోటా తింటే బరువు తగ్గుతారా..!? పెరుగుతారా..!?
క్యాన్సర్ ను పోరాడే గుణాలు సపోటాలో ఉన్నాయా..?
సపోటాలోని యాంటీ-ఆక్సిడెంట్లు,పీచు పదార్ధాలు,పోషకాలు కాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి.ఇందులో ఉండే విటమిన్ A ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.సపోటా పండులో ఉండే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఎముకలు గట్టిగా అవ్వడానికి ఉపయోగపడతాయి.దీర్ఘకాలంగా వచ్చే దగ్గు తగ్గడానికి సపోటా పండు ఎంతగానో దోహదం చేస్తుంది.సపోటా పండు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇది నిద్రలేమి,ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు ఎంతో మంచి చేస్తుంది.
సపోటా పండుతో ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఆరోగ్యం… అందానికి అందం :
సపోటా పండు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.సపోటా పండు తినడం గాని లేదంటే సపోటా జ్యూస్ తాగడంగానీ చేస్తే జుట్టు సమస్య అనేది తగ్గుతుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు ఉన్నవారికి సపోటా పండు చక్కని పరిష్కారం చూపుతుంది.సపోటా పండులో ఉండే పోషకాలు తల వెంట్రుకలకు కావలిసిన పోషకాలను అందిస్తాయి. అలాగే సపోటాలో ఉండే విటమిన్ ఏ, బి చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుచుతుంది.