మధురమైన తేనె మానవునికి సమతులాహారాన్ని అందింస్తుంది. తేనే వలన చలువ చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. బలమును కలిగిస్తుంది . హృదయమునకు ,నేత్రములకు మంచిది. చర్మానికి కాంతిని కలిగించును. శరీరంలో కొవ్వుని పెరగనివ్వదు. పుండ్లను మాన్పును. ఇలా ఎన్నో గొప్ప ఔషధ గుణాలు తేనెలో కలవు.
నోటిలో పుండ్లకు , దద్దులకు తేనె అత్యుత్తమంగా పనిచేయును. నోటిపూతకు తేనె రాస్తే నోటిపూత తగ్గును.తులసిరసముతో , తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ , న్యుమోనియా మొదలగు వ్యాధులు నివారించబడును. ప్రతినిత్యం తేనెని తీసుకోవడం వలన చక్కటినిద్ర రావడమే కాకుండా సుఖవిరేచనం అగును. కాలిన గాయాలను , పుండ్లను , కురుపులను తేనె వెంటనే మాన్పును . బంగారుఛాయలో సన్నగా ఉండాలనుకునే స్త్రీలు తప్పకుండా నిత్యం తేనెని తీసుకోవడం చాలా మంచిది.
తేనెలో పసుపు కలిపి ఉండలుగా చేసుకుని తినుచున్న మొటిమలు తగ్గును. ముఖసౌందర్యము కొరకు పాలను తేనెలో కలిపి ముఖంపై రాసుకుని కొద్దిసేపు అయ్యాక కడిగివేసిన ముఖము సౌందర్యముగా, కనిపించును. క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం, ఉత్తేజం కలిగి త్వరగా అలసట రాదు . ఆటలు ఆడిన తర్వాత తీసుకుంటే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి.
తేనె పుచ్చుకుంటే కళ్ళకు చలువ చేసి దృష్టి మెరుగుపడేలా చేస్తుంది.తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి.తేనెలో కొద్దిగా ఆముదం చేరిస్తే మంచి విరేచనకారిగా పనిచేస్తుంది.శరీరంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమం బాగా పనిచేస్తుంది. 3 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల తేనెను టీ డికాషన్‌లో కలిపి తాగుతూ ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.