NewsOrbit
హెల్త్

రోజూ ఈ టీ తాగితే… సీజనల్ రోగాలన్నీ పరార్… ఇలా చెయ్యండి.

రోజూ ఈ టీ తాగితే... సీజనల్ రోగాలన్నీ పరార్... ఇలా చెయ్యండి.

 ప్రపంచంలో మంచినీళ్లు తర్వాత ఎక్కువ మంది తాగేది టీ నే. ముఖ్యంగా మన దేశం లో టీ ఏకం గా జాతీయ పానీయం అయ్యింది.

రోజూ ఈ టీ తాగితే... సీజనల్ రోగాలన్నీ పరార్... ఇలా చెయ్యండి.

కొంత మంది మేం టీ తాగం అంటారు. కానీ టీ తాగితే ఎంతో మేలు. ఎందుకంటే తేయాకులో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవి మన శరీరంలో విష వ్యర్థాలను తరిమేస్తాయి. చైతన్యం తెస్తాయి. రీఫ్రెష్ కలిగిస్తాయి. గ్రీన్ టీ లాంటివి,అధిక బరువును తగ్గిస్తాయి. అదే అల్లం టీ అయితే, జబులు, గొంతులో గరగరను పోగోడుతుంది. ఇప్పుడు మనం లెమన్ గ్రాస్ టీ గురించి తెలుసుకుందాం .లెమన్ గ్రాస్‌ అనేది ఓ రకమైన గడ్డి మొక్క. దానికీ నిమ్మకాయకూ సంబంధం లేదు. కానీ అది నిమ్మకాయ వాసన వస్తుంది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. లెమన్ గ్రాస్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, క్యాల్షియం మరియు మెగ్నీషియంలున్నాయి.

కొన్ని పరిశోధనల ప్రకారం లెమన్ గ్రాస్ మనస్సును ప్రశాంత పరుస్తుంది. ఆందోళను తగ్గిస్తుంది . దాంతో మూడ్ లో మార్పులు వస్తాయి.లెమన్ గ్రాస్ ముక్కు దిబ్బడ , జలుబు మరియు గొంతు నొప్పిని నివారిస్తుంది. శ్వాస బాగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది . మరియు లెమన్ గ్రాస్ లో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తి పెంచడానికి బాగా సహాయపడుతుంది.కొలెస్ట్రాల్ తగ్గించడంతో రక్తకణాల్లో కొవ్వు చేరకుండా హార్ట్ అండ్ హార్ట్ అటాక్ సమస్యల నుండి రక్షిస్తుంది.లెమన్ గ్రాస్ ను తరచూ తింటుంటే మతిమరపు నుండి ఉపశమనం పొందుతారు. రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల నాడీవ్యవస్థను స్థిరంగా ఉంచుతుంది.కండరాల నొప్పులు, వాపులు, సలుపులను నివారిస్తుంది . మరియు ఇది ఆర్థరైటిస్, గౌట్, దంతక్షయం, మరియు ఇన్ఫ్లమేషన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటివాటన్నింటికి ఉపశమనం కలిగిస్తుంది.లెమన్ గ్రాస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అజీర్తి మరియు మలబద్దకం సమస్యల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. ఇది బౌల్ ను శుభ్రపరచడానికి మరియు యూరినరీ ట్రాక్ క్లియర్ చేయడానికి , జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

ఈ లెమన్ గ్రాస్ మన దేశ మార్కెట్లలో పెద్దగా కనిపించదు. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో మాత్రం లెమన్ గ్రాస్ టీ ప్యాకెట్లు లభిస్తాయి. అలా మనం ఈ టీ తాగొచ్చు. లెమన్ గ్రాస్ (గడ్డి మొక్క)ను ఇళ్లలో పెంచుకోవచ్చు. ఆహారంలో వేసుకోవచ్చు. టీలాగా తాగొచ్చు.

మిగతా టీల్లాగే… ఇందులోనూ బాడీలో విషవ్యర్థాల్ని తరిమేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కణాలు పాడవకుండా కాపాడతాయి. అందువల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గుండెకు ఈ టీ ఎంతో మేలు చేస్తుంది.

లెమన్ గ్రాస్ టీలో సూక్ష్మక్రిముల అంతు  చూసే లక్షణం ఉంటుంది. అది మన నోటి దంతాలను కాపాడడంతో పాటు దుర్వాసన పోగొడుతుంది. దంతాలు కుళ్లిపోకుండా చేస్తుంది. చిగుళ్లు దెబ్బ తినకుండా కాపాడుతుంది.

రకరకాల వ్యాధుల్లో ఒకటైన కాన్సర్ రాకుండా లెమన్ గ్రాస్ టీ కాపాడుతోందని పరిశోధనల్లో తేలింది. కీమోథెరపీ చేసే సమయంలో,ఈ టీ ఇస్తున్నారు.

కొంతమందికి ఏం తిన్నా సరిగా జీర్ణం కాదు. అలాంటి వారు ఆహారం తిన్నాక ఈ టీ తాగితే దెబ్బకు అరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు కూడా.చర్మంపై మొటిమలు, మచ్చలు, ఆనికాయలు, కురుపులు ఇలాంటివి ఏవి ఉన్నా ఈ టీ తాగుతూ ఉంటే, క్రమంగా అవి తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ టీలో గుణాలు చెడు కణాల్ని తొలగించి మంచి కణాల్ని పెంచుతాయి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri