బెడ్ రూమ్ లో నిమ్మకాయలు ఉండ వచ్ఛా ?

బెడ్ రూమ్ లో నిమ్మకాయలు ఉండ వచ్ఛా ?
Share

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు అధికం. నిమ్మ కాయలు మన దేశంలో విరివిగా లభ్యమవుతూంటాయి. అంతేకాదు, నిమ్మకాయను ఔషధంగా కూడా కొన్ని అనారోగ్యాలకు ఉపయోగిస్తారు. నిమ్మవలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

బెడ్ రూమ్ లో నిమ్మకాయలు ఉండ వచ్ఛా ?
నిమ్మకాయలను రూమ్‌లో పెడితే ప్రత్యేకంగా రూమ్ ప్రెషర్ అవసరం ఉండదు.నిద్రపోయే ముందు నిమ్మకాయలను ముక్కులుగా కోసి బెడ్ రూమ్‌లో పెడితే గాలి శుభ్రమవుతుంది.నిమ్మ వాసనతో గది పరిమళ భరింతం అవుతుంది. నిమ్మకాయ ముక్కలను బెడ్రూంలో పెట్టుకుని నిద్రిస్తే శ్వాస చక్కగా తీసుకోగలుగుతారు. ఆస్తమా, అలర్జీలు, జలుబు తదితర సమస్యలతో బాధపడుతున్నవారు నిమ్మ ముక్కలను బెడ్ రూమ్‌లో పెట్టుకుని నిద్రిస్తే మంచిది. ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే తప్పకుండా నిమ్మ ముక్కలను గదిలో పెట్టుకుని నిద్రించండి.

నిమ్మ వాసన వల్ల యాంగ్జైటీ దూరమై మీలో పాజిటీవ్ ఫీలింగ్స్ కలుగుతాయి. నిమ్మ వాసన వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.నిమ్మ వాసన ఒత్తిడిని సైతం దూరం చేయడం తో పాటు, డిప్రెషన్‌ను తొలగిస్తుంది. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే నిమ్మకాయను కట్ చేసి లవంగాలను గుచ్చి పెడితే దోమలు పారిపోతాయ్. ప్రయాణాల్లో నిమ్మకాయ వాసన చూడటం వల్ల కడుపులో తిప్పడం, వికారం తగ్గుతుంది.నిమ్మ వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం.నిమ్మరసం రక్తాన్ని శుద్ధి చేసి, అందులోని రోగ కారక క్రిములను నశింప చేయడంతోపాటు  కలరా, మలేరియా వంటి వ్యాధులు దరిచేరకుండా  కాపాడుతుంది .నిమ్మ కాయలను ఆహారంతో తీసుకుంటే వృద్ధాప్య చాయలు కనిపించవు.
ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలను తగ్గించడంలోనూ నిమ్మ ఉపయోగపడుతుంది.రోజు కో గ్లాస్ నిమ్మ రసం తాగితే వల్ల ఆర్థరైటీస్, జీర్ణ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు. నిమ్మరసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్యను అరికట్టవచ్చు.


Share

Related posts

ఈ ఆహార ప‌దార్థాలు తీసుకుంటే పుష్ఠిగా ఉంటారు!

Teja

మీరు పిల్లలతో ఇలా చేయిస్తున్నారా ?? ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలిసిన విషయం

Kumar

గుళ్ళో శఠగోపం తలమీద పెట్టినప్పుడు ఏం జరుగుతుంది !

Kumar