వట్టి వేర్ల గుణాలు తెలుసుకుంటే వదిలిపెట్టరు

చాలా మందికి వట్టి వేర్లు మంచివనీ, గొప్పవనీ, తెలుసు కానీ,వీటిని ఎలా వాడా లో వేటికి  వాడితే ప్రయోజనం అన్నది మాత్రం సరిగా తెలియదు. అవితేలిస్తే మాత్రం కచ్చితంగా కొనివాడతారు. ఓ మట్టి కుండలో వట్టి వేర్లను వేసి వేర్లు నీటి లో పూర్తిగా మునిగేలా తాగే నీరు పోయండి. ఆ తర్వాత కొన్ని గంటల పాటు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత నీటిని వడగట్టి, ఆ నీటిని తాగేందుకు ఉపయోగించుకోవాలి.వట్టి వేర్లునీటిని చల్లబరుస్తాయి.

వట్టి వేర్ల గుణాలు తెలుసుకుంటే వదిలిపెట్టరు

శరీరంలో వేడిని తగ్గించి చలవ చేసేలా చేస్తాయి.ఇవి సహజసిద్ధం గా విష వ్యర్థాలు, విష సూక్ష్మక్రిములతో పోరాడే శక్తి కలిగి ఉంటాయి. శరీరం లో వేడిని తగ్గించి ఉపశమనంకలిగిస్తాయి. మానసికం గా కూడా ప్రశాంతం గా ఉంటుంది. బుర్ర చల్లగా ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా చేస్తుంది . కోపం, ఆవేశం తగ్గి గొడవల వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు. వట్టి వేర్ల నుంచీ వచ్చే నూనె  కూడా చాలాబాగా పనిచేస్తుంది. ఇది విడిగా మార్కెట్లలో దొరుకుతుంది.

ఇది  యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది. ఈ నూనెని ని చర్మం, జుట్టుకి వాడినట్టయితే నురగలా వచ్చి బాగా శుభ్రపడతాయి .లేదంటే కొన్ని వట్టివేర్లు తీసుకుని ఒక గాజు సీసాలో వేసి అవి మునిగేవరకు కొబ్బరినూనె పోసి ఒక రోజంతా వేర్లు నూనె లో నానిన తర్వాత నూనె లో అలానే వేర్లు వదిలేసి నూనెను తలకు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కొన్ని కంపెనీలు ఈ వేర్లతో వేడి ఇంటిలోకి రాకుండా అడ్డుకునే  చాపలు ,పరుపులుతయారీకి వాడుతున్నాయి. ఈ పరుపుల పై పడుకుంటే, చల్లగా ప్రశాంతం గా ఉండడంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇలాంటి సహజసిద్ధ మూలికల్ని వాడుకుని ఎన్నోప్రయోజనాలను పొందవచ్చు