Banana: తొక్కే కదా అని తేలికగా అవతల పారేయకండి… దాని వల్ల ఎన్ని లాభాలో తెలుసుకోండి!!(పార్ట్-1)అరటి పండ్లు అందరికి అందుబాటులో ఉండటం తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పోషకాలు పుష్కలంగా ఉండే అరటి పండ్లు రోజుకు ఒక్కటి తిన్న మంచిదే.. మన శరీరానికి అవసరమైన పొటాషియం మొత్తం ఈ పండు తో పొందవచ్చు. అరటి పండ్లు తిని తొక్క పడేస్తుంటారు. అరటి పండు లోనే కాదు తొక్కలో కూడా అధికమైన పోషకాలు ఉన్నాయి. కాబట్టి ఈ తొక్కను పడేయకుండా అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.అరటి పండు తో పాటు తొక్క లో కూడా పొటాషియం ఎక్కువగా లభిస్తుంది .
దోమలు లేదా వేరే కీటకాలు కుట్టి చర్మంపై దద్దుర్లు వచ్చినప్పుడు,అరటి తొక్క తీసుకుని ఆ ప్రదేశంలో రుద్దితే నొప్పి, వాపు తొలగిపోతాయి. ముఖానికి ప్రతి రోజు అరటి తొక్కతో రుద్దడం వల్ల చర్మం అందంగా మారడం తో పాటు ముడతలు లేని చర్మాన్ని ఇస్తుంది. నల్లని మచ్చలు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గుతాయి. చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్లా కూడా ఇది ప్రభావం చూపుతుంది.తలనొప్పి ఎక్కువగాఅనిపిస్తే, అరటి తొక్కను డీప్ ఫ్రిజ్లో అరగంట ఉంచి దాన్ని నుదురుపై పెట్టుకుంటే తల నొప్పి నెమ్మదిస్తుంది.
కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే గుచ్చు కున్న చోటా కొద్దీ సేపు అరటి తొక్క ఉంచి ఆ తర్వాత ముల్లు తీసేస్తే తేలికగా వచ్చేస్తుంది. కొన్ని కొన్ని సార్లు మటన్ ఎంతసేపు ఉడికించిన ఉడకదు. అలాంటప్పుడు అరటి తొక్క వేసి ఉడికిస్తే మెత్తగా ఉడుకుతుంది.వెండి సామాన్లు తళతళ మెరుస్తూ ఉండాలంటే ఒక అరటి తొక్క తీసుకొని దాని లోపలి భాగం తో రుద్దితే సరిపోతుంది. పాటు లెదర్ షూస్ నీట్ గా ఉండాలన్న కూడా అరటి తొక్కతో పాలిష్ చేసుకోవచ్చు .