బ్రేక్ ఫాస్ట్ ఈ రకం గా తింటే ఖచ్చితం గా బరువు తగ్గుతారట!!

బరువు తగ్గించుకోవడంలో వ్యాయామానికి ఎంతప్రాధాన్యత ఉందో, అంతే ప్రాముఖ్యత మనం తీసుకునే డైట్ మీద కూడా ఆధార పడి ఉంటుంది. అందుకే పొట్ట  కరిగించుకోవాలనుకునే వారు ప్రదానం గా డైట్ మీద ప్రత్యేక శ్రద్ద పెట్టడం చాలా అవసరం. ముందుగా ఒక ఆరోగ్యకరమైన  బ్రేక్ ఫాస్ట్ తో రోజును ప్రారంభించాలి. తరువాత భోజనం మితంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే రాత్రి భోజనం కూడా చాలా తేలిక పాటి ఆహారాన్ని ఎంచుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్ ఈ రకం గా తింటే ఖచ్చితం గా బరువు తగ్గుతారట!!

బరువు తగ్గించే క్రమంలో ఉదయం తీసుకొనే అల్పాహారం చాలా ప్రభావంతం  గా పనిచేస్తుంది. అదే విధంగాఇప్పుడు  చెప్పబోయే బ్రేక్ ఫాస్ట్ లు పూర్తి రుచికరంగా పోషకాలు కలిగి ఉంటాయి. ఆరోగ్యంగా ఉంచడానికి పోహా బ్రేక్ ఫాస్ట్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇది పొట్టను తేలికగా ఉంచుతుంది.పోహా చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉండడమే కాకుండా కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బరువు తగ్గడానికి దోసను కూడా తినవచ్చు.

ముఖ్యంగా అడై దోస ను తినవలిసి ఉంటుంది. దోసెకు చాలా తక్కువ నూనెను వేసుకోవాలి. లేదా నాన్ స్టిక్ పాన్ లో  దోసెను తయారుచేసి తినవచ్చు. ఇది కూడా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ గా చెప్పవచ్చు.
గోధుమతో తయారుచేసిన బ్రెడ్ మరియుఉప్పు మిరియాల పొడి వేసిన పోచ్చ్డ్ ఎగ్ ఫ్రై, ఒక ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ గా  చెప్పవచ్చు .బరువు తగ్గించే ప్రోటీన్ ఫుడ్స్ లో శక్తివంతమైనది గుడ్డు.
గుడ్డులో అధిక న్యూట్రీషియన్స్ కలిగి ఉండి శక్తిని అందివ్వడంతో పాటు బరువును బాగా తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి ఆవిరిలో ఉడికించిన పదార్థాలన్నీకూడా చాలా బాగా  పనిచేస్తాయి. కాబట్టి, ఆరోగ్య  కరంగా బరువు తగ్గించుకోవాలంటే గోధుమ రవ్వ లేదా రాగి ఇడ్లీలను హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గా చేసుకోండి.మరో ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ కు పండ్లు మరియు పాలుకలిపి  తీసుకోవాలి. ఇలా తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఓట్స్ తో ఉప్మా లేదా దోస తయారు చేసుకుని తినవచ్చు.