మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మానవుని జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని అనడంలో ఏ మాత్రం. అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎందుకంటే మన తీసుకునే ఆహారం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా తినే తిండి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే లేనిపోని అనారోగ్యల బారిన పడతాం. వాస్తవానికి కొందరికి తినే ఆహారం ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేక ఆరోగ్యానికి హాని చేస్తుందా అనే విషయం కూడా తెలియదు. కానీ ఇలా ఆహారం పట్ల అవగాహన లేకపోతే మాత్రం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారికి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే నిత్యం వంటలకు ఉపయోగించే వంట నూనెల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి.ఎందుకంటే వంట నూనెల్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్,సాచురేటెడ్ ఫ్యాట్స్ అనే రెండు రకాల ఉండే ఆయిల్స్ ఉంటాయి.నిజానికి మనం వంటల్లో ఉపయోగించే వంట నూనెల్లో కేవలం ఐదు రకాల నూనెలు మాత్రమే ఆరోగ్యానికి మంచివి అని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఒక నివేదిక ద్వారా తెలిపారు.మరి ఆ ఐదు రకాల వంట నూనెలు ఏవో తెలుసుకుందామా..
ఆలివ్ ఆయిల్:
ఈ నూనె వాడడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.ఆలివ్ ఆయిల్ చాలా తేలికైనది. ఆలివ్ నూనెతో ఆహారాన్ని తయారు చేస్తే, అది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.ఆలివ్ నూనెలో విటమిన్-ఇ, విటమిన్ కె, ఒమేగా-3, 6 కొవ్వు ఆమ్లాలు, ఐరన్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. గుండెకు కూడా మేలు చేస్తుంది.
సన్‌ఫ్లవర్ ఆయిల్:
సన్ ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ ఈ పుష్కలం గా లభిస్తుంది.నూనె కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.శరీరానికి కావల్సిన కీలక పోషకాలను అందించడంతో పాటు.. శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగిస్తుంది సన్‌ఫ్లవర్ ఆయిల్.
కార్న్ ఆయిల్:
ఈ మొక్కజొన్న నూనెను ప్రధానంగా ఆహారం కోసం ఉపయోగిస్తారు . ఇది సలాడ్ ఆయిల్ మరియు ఫ్రైయింగ్ ఆయిల్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది.ఈ నూనేలోని పాలి అన్ సాచురేటెడ్ ,మోనో అన్ సాచురేటెడ్,ప్యాటి ఆసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచటంతో పాటు గుండె జబ్బులను దూరంగా ఉంచుతాయి. ఇవి కొలస్ట్రాల్ పెరగకుండా నిరోదిస్తాయి
వైట్ మస్టర్డ్ ఆయిల్:
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందించుతుంది. ఈ ఆయిల్ లో మోనో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు పోలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఒమేగా-3 మరియు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి.
నట్స్ ఆయిల్:
నట్స్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ నూనెలో కూడా మంచి పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అందుకని ఈ ఆయిల్ ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది