కొన్ని పండ్ల ని ఎక్కువగా గాతినడం ద్వారా అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. ఆ పండ్లుగురించి తెలుసుకుందాం.. అరటి పండు తింటే బరువు పెరుగుతామని అపోహపడుతూ ఉంటారు. అయితే అందులో ఎంత మాత్రం నిజంలేదంటున్నారు ఆహార నిపుణులు . అరటిపండు ఒకటి తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది.
దీంతో చాల సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకుపచ్చ రంగు లో ఉండే అరటి పండ్లలో కొవ్వు కరిగించే పద్దతిని వేగవంతం చేసే పోషకాలు ఉంటాయి. అప్పుడప్పుడు అరటిపండ్లు తిని నీరు తాగడం వల్ల రోజంతా కడుపు నిండుగా ఉంటుంది. జామలో పీచుపదార్ధం ఎక్కువగా ఉంది కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిఫలమని చెప్పవచ్చు . జామకాయలో పోషకాలు, విటమిన్లు, వల్ల షుగరు ఉన్నవాళ్లు కూడా తినవచ్చు.
ఇవి అన్ని కాలాల లో అందరికి అందుబాటులో దొరుకుతాయి. ఆపిల్స్ లో ఎన్నో పోషకాలు ఉండడం వల్ల బరువు తేలికగా తగ్గుతారు. ఫ్లేవనాయిడ్లు,డైటరీ ఫైబర్, బీటా కెరోటీన్ కలిగిన ఆపిల్స్ బరువుని తగ్గించడంలో ముందుంటాయి. అధికంగా నీటి శాతం కలిగే ఉండే పుచ్చకాయలని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మేలు .వీటిని తినడం వలన ఆకలి సమస్యఉండకపోవడం ఫలితంగా బరువు తగ్గుతాం. వయస్సు పెరుగుతున్నా శరీరాన్ని యవ్వనంగానే ఉంచేందుకు అవకాడో మంచి ఔషధం గా పనిచేస్తుంది. ఇది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యం గా ఉంచడం తో పాటు అధిక బరువు ను కూడా తగ్గిస్తుంది.
వీటిల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు చర్మ సంరక్షణ కు ఉపయోగపడితే, విటమిన్ సీ, విటమిన్ ఈ లు వృద్ధాప్య ఛాయలను రానివ్వకుండా కాపాడుతాయి .గ్రేప్ ఫ్రూట్స్‌లో అన్ని రకాల విటమిన్స్‌తో పాటు మంచి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. బరువు తగ్గించేందుకు,చర్మ సంరక్షణలోనూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మకాయల లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. భోజనం చేసిన తరువాత నిమ్మ రసం తాగడం శరీరానికి చాలా మంచిది. ఇందులోని సిట్రస్ యాసిడ్ శరీర బరువు పెరగనీయకుండా నాజూగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.నిమ్మ, తేనెల మిశ్రమం స్త్రీ లు బరువు తగ్గేందుకు అద్బుతంగా పని చేస్తుంది. కొవ్వు కణాల తో పోరాడగలిగే శక్తి నిమ్మ కు ఉంది. ఇది ఆకలిని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది.
కివీ లో విటమిన్ సి, పీచు అధికంగా ఉంటుంది. తక్కువ క్యాలరీలు ఉంటాయి.
రోజుకు ఒక కివీ పండును తింటే కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి.బరువును తగ్గిస్తాయి. షుగర్ ఉన్న వారికి ఈ పండు దివ్య ఔషధం. రక్తం లోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కడుపు నిండిన భావనను ఈ పండ్లు కలగజేస్తాయి.టమాటల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుషల్కంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ టమాటా తో లభిస్తాయి. వీటిలోని లైకోపీన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టమాటా జ్యూస్‌ను నిత్యం తీసుకుంటే బరువు తగ్గేందుకు మంచి అవకాశం గా ఉంటుంది. , స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీలుబ్లాక్ బెర్రీ, క్రాన్ బెర్రీ ఇలా ఏవైనా కూడా బరువుని తగ్గిస్తాయి.వీటిలోయాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొవ్వుని తగ్గించి బరువు తగ్గేందుకు ఈ పళ్ళు ఎంతో బాగా పనిచేస్తాయి..