హెల్త్

జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇంటి చిట్కాలు..!!

Share

అందమైన జుట్టు కావాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి.పొడవాటి, ఒత్తయిన జుట్టు కోసం ప్రతి ఒక్కరు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం,తెల్ల బడడం వంటి రకరకాల జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.జుట్టును కాపాడుకోవడం కోసం మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటి వలన తాత్కాలిక ఫలితం ఉంటుంది కానీ శాశ్వత పరిష్కారం ఉండదు. అందుకే జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి.

జుట్టుకు ఆయిల్ రాయడం :

తరచుగా జుట్టుకి ఆయిల్ రాయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఊరికే ఆయిల్ రాసి వదిలేయకుండా జుట్టుకు ఆయిల్ రాసి మసాజ్ చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు కనిపిస్తాయి. ఆయిల్‌ను కాస్త వేడి చేసి మాడుకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మరింత పెరిగి కుదుళ్లు మరింత దృఢంగా అవుతాయి. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

ఆయిల్ మసాజ్ ఎలా చేయాలంటే..?

హాట్ ఆయిల్ మసాజ్ చేయాలనుకునేవారు ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకుని దానిని వేడి చేయాలి. ఆపై గోరువెచ్చని నూనెలో మీ వేళ్ళను ముంచి తలపై చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా, మీ తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలానే నూనె జుట్టు మూలాల్లోకి ప్రవేశించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.


Share

Related posts

చర్మ నిగారింపు కోసం దీన్ని మించింది లేదు…ప్రయత్నించి చూడండి!

Kumar

Corona : ఇదేం ద‌రిద్రం… క‌రోనా పెరుగుతుంటే ఇలాంటి రాజ‌కీయాలా?

sridhar

Betel Leaf: తమలపాకు మిరియాలు కలిపి తింటే..!?

bharani jella